న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనా భయం.. హోమ్ క్వారంటైన్‌లో స్మృతి మంధాన!!

Smriti Mandhana in home quarantine in Sangli after returning from Mumbai

ముంబై: ప్రస్తుతం మహమ్మారి కరోనా వైరస్‌ గురించి ప్రపంచమంతా ఎంత చర్చ జరుగుతోందో అందరికి తెలిసిన విషయమే. కరోనాను ఇప్పుడు విస్మరించాల్సిన విషయం కాదు. ఈ వైరస్ సోకినట్లయితే ప్రాణానికే ప్రమాదం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ కారణంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించాయి. ఇతర దేశాలు, నగరాల వచ్చేవారు స్వీయ నిర్బంధంలో ఉండాలని భారత ప్రభుత్వం కూడా ఆదేశించింది. ఈ ఆంక్షల నేపథ్యంలో టీమిండియా సీనియర్‌ బ్యాట్స్‌వుమన్‌ స్మృతి మంధాన క్వారంటైన్‌కు వెళ్లింది.

నో ప్లే.. నో పే: ఐపీఎల్‌ రద్దైతే ఆటగాళ్లకు భారీ షాక్!!నో ప్లే.. నో పే: ఐపీఎల్‌ రద్దైతే ఆటగాళ్లకు భారీ షాక్!!

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన ఇటీవ‌లే ముంబై నుంచి సొంత‌గ‌డ్డ సాంగ్లీకి చేరుకుంది. ఈ నేప‌థ్యంలో గృహ నిర్భంధంలో ఉండాల‌ని ఆమెకు వైద్యులు సూచించారు. క్వారంటైన్‌లో ఉన్న మంధాన‌ను రోజువారీగా ప‌రీక్షిస్తుంటామ‌ని సాంగ్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి రవీంద్ర టేట్ ఓ ప్రకటనలో తెలిపారు. క‌రోనాకు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగానే మంధానాను హోమ్ క్వారంటైన్‌లో ఉంచామ‌ని తెలిపారు. ముంబై చేరుకునే ముందు ఆమె టీ20 ప్రపంచకప్ ఆడి భారత్ చేరుకున్న విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవ‌ల ముగిసిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో స్మృతి మంధాన బ‌రిలోకి దిగింది. అయితే మెగా టోర్నీలో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోయింది. ఫైనల్లో ఆస్ట్రేలియాపై 85 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మొదటగా బ్యాటింగ్‌కు చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేనలో భారత్‌ 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది.

కరోనా వైరస్‌ పోరు కోసం తెలుగమ్మాయి, భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చేతులు కలిపింది. మొత్తం రూ.10 లక్షలు విరాళం ప్రకటించింది. అందులో ప్రధాన మంత్రి నిధికి రూ.5 లక్షలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు ట్విటర్‌లో పేర్కొంది. సీనియర్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ రూ.2 లక్షలు, ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ రూ.1.5 లక్షల విరాళం ప్రకటించారు

Story first published: Wednesday, April 1, 2020, 11:53 [IST]
Other articles published on Apr 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X