న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'డేవిడ్ వార్నర్ రాకను స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌ వ్యాఖ్యలు ఆపలేవు'

Smith, Bancroft Statements Not Going to Impact Warner Reintegration Plan: CA CEO Roberts

హైదరాబాద్: ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ల వ్యాఖ్యలు డేవిడ్‌ వార్నర్‌ను తిరిగి జట్టులోకి రాకుండా ఆపలేవని క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్‌ రాబర్ట్స్‌ అన్నాడు. డేవిడ్ వార్నర్‌పై ఎవరెన్ని వ్యాఖ్యలు చేసిన అతడు తిరిగి జట్టుకు ఆడటం ఖాయమని ఆయన స్పష్టం చేశాడు.

<strong>బాక్సింగ్ డే టెస్టు, Day 2: పుజారా, కోహ్లీ, రోహిత్ సాధించిన రికార్డులు</strong>బాక్సింగ్ డే టెస్టు, Day 2: పుజారా, కోహ్లీ, రోహిత్ సాధించిన రికార్డులు

రెండు రోజుల క్రితం డేవిడ్‌ వార్నర్‌ వల్లే తాను బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డానని గిల్‌క్రిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌, స్టీవ్‌ స్మిత్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు డేవిడ్ వార్నర్‌కు తిరిగి జట్టులో చోటు దక్కడం అనుమానమేనని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్‌ రాబర్ట్స్‌ మాట్లాడుతూ "ఈ వ్యాఖ్యలు వార్నర్‌ను అడ్డుకుంటాయని అనుకోను. అతడితో కలిసి పనిచేయడంపై దృష్టి సారించాం. ఎంపికకు అర్హత సాధించగానే జట్టు ప్రణాళికలో భాగమవ్వడం గురించి మూడు రోజుల క్రితం అతడితో మాట్లాడా. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు ముఖ్యం కాదు" అని అన్నాడు.

"వార్నర్ జట్టులో కలిసిపోవడం గురించి ఆలోచిస్తున్నాం. టీమిండియాతో సిరీస్‌ 1-1తో సమంగా ఉన్న సమయంలో స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ నుంచి ఇలా మాట్లాడటం మంచిది కాదు. బాల్‌ ట్యాంపరింగ్‌కు మూల కారణం డేవిడ్‌ వార్నరే అని ఇంతకు ముందే మా విచారణలో తేలింది కదా" అని రాబర్ట్స్‌ అన్నాడు.

<strong>పరుగులో అలసిపోయి ఇక చాలు అంటూ కోహ్లీకి పుజారా సైగలు (వీడియో)</strong>పరుగులో అలసిపోయి ఇక చాలు అంటూ కోహ్లీకి పుజారా సైగలు (వీడియో)

గతంలో జట్టు వరుస ఓటములు ఎదుర్కొన్నప్పుడు అప్పటి సీఈఓ జేమ్స్‌ సుథర్‌ల్యాండ్‌, హై ఫర్ఫామెన్స్‌ కోచ్‌ ప్యాట్‌ హోవర్డ్‌ గెలిచేందుకు డబ్బులిస్తున్నామని, ఆడేందుకు కాదు అని అన్నాడని మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్యలపై కూడా రాబర్ట్స్‌ స్పందించాడు. "గెలవడమే మా లక్ష్యం. ఇందులో అపార్థం చేసుకోవద్దు. మా ఉద్దేశం గౌరవంగానే పోరాడాలి" అని చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, December 27, 2018, 20:16 [IST]
Other articles published on Dec 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X