న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓవల్‌లో ఆసీస్ పరుగుల వరద: శ్రీలంక విజయ లక్ష్యం 335

SL vs Aus LIVE score ICC CWC 2019: Finchs 153 helps Australia post 334-7

హైదరాబాద్: ఓవల్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌‌లో ఆస్ట్రేలియా పరుగుల మోత మోగించింది. ఓపెనర్ అరోన్ ఫించ్ 132 బంతుల్లో 153(15ఫోర్లు, 5సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... స్టీవ్ స్మిత్ 59 బంతుల్లో 73(7ఫోర్లు, సిక్స్), మాక్స్‌వెల్ 25 బంతుల్లో 46 నాటౌట్‌ (4ఫోర్లు, సిక్స్) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 334 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో ధనంజయ డిసిల్వా, ఇసురు ఉదాన చెరో రెండు వికెట్లు తీశారు. ఆరంభంలో తేలిపోయి ఆఖర్లో పుంజుకున్న శ్రీలంక బౌలర్లు చివరి ఐదు ఓవర్లలో కేవలం ఒక్క ఫోర్ మాత్రమే ఇచ్చారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టాస్ గెలిచిన శ్రీలంక

టాస్ గెలిచిన శ్రీలంక

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌‌కు ఆహ్వానించింది. ఆరంభంలో డేవిడ్ వార్నర్ నిదానంగా ఆడుతుంటే ఫించ్ మాత్రం లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డుని ముందుకు నడిపించాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించిన తర్వాత డేవిడ్ వార్నర్ 48 బంతుల్లో 26(2 ఫోర్లు) ధనుంజయ డిసిల్వా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఫించ్‌కు జత కలిసిన స్టీవ్‌ స్మిత్‌

ఆ తర్వాత వచ్చిన ఖవాజా(10) నిరాశపరిచాడు. జట్టు స్కోరు 100 పరుగుల వద్ద ధనుంజయ డిసిల్వా బౌలింగ్‌లో ఉదానకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ తరుణంలో ఫించ్‌కు జత కలిసిన స్టీవ్‌ స్మిత్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ నిలకడగా ఆడి వందకుపైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 53 బంతుల్లో హాఫ్‌సెంచరీ చేసిన ఫించ్.. 97 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు.

రెండో బంతిని సిక్స్‌గా మలచి ఆరోన్ సెంచరీ

రెండో బంతిని సిక్స్‌గా మలచి ఆరోన్ సెంచరీ

33వ ఓవర్‌లో సిరివర్దన వేసిన రెండో బంతిని సిక్స్‌గా మలిచి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో సెంచరీ బాదిన తొలి కెప్టెన్‌గా అరోన్ ఫించ్ నిలవడం విశేషం. వన్డేల్లో ఆరోన్ ఫించ్‌కి ఇది 14వ సెంచరీ. ఖవాజా ఔటైన తర్వాత కొద్దిసేపు పరుగులు రాకుండా లంక బౌలర్లు అడ్డుకున్నారు కానీ వికెట్లు తీయలేకపోయారు. చివరి పవర్ ప్లేలో ఆరోన్ ఫించ్ కళ్లుచెదిరే షాట్లతో ఆకట్టుకున్నాడు.

1వ ఓవర్లో చెరో రెండు ఫోర్లు 18 పరుగులు

1వ ఓవర్లో చెరో రెండు ఫోర్లు 18 పరుగులు

బంతులను స్టాండ్స్‌లోకి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. నువాన్ ప్రదీప్ వేసిన 41వ ఓవర్లో చెరో రెండు ఫోర్లు 18 పరుగులు రాబట్టాడు. ఇదే ఓవర్‌లో ఫించ్ 150 పరుగుల మార్క్ అందుకున్నాడు. క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత ఆరోన్ ఫించ్ విధ్వంసం సృష్టించాడు. లసిత్ మలింగ వేసిన 42వ ఓవర్‌లోనూ 14 రన్స్ రాబట్టారు.

కరుణరత్నేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరిన ఫించ్

ఉదాన వేసిన 43వ ఓవర్లో స్లో బంతిని భారీ షాట్ ఆడిన ఆరోన్ ఫించ్ ఎక్స్‌ట్రా కవర్‌లో కరుణరత్నేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే మలింగ వేసిన యార్కర్‌కు స్మిత్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ ఇన్నింగ్స్ మరింత దూకుడుగా సాగింది. నువాన్ ప్రదీప్ వేసిన 22వ ఓవర్లో 4ఫోర్లు, సిక్స్ బాది 22 రన్స్ రాబట్టాడు. టీ20 తరహాలోనే తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.

డెత్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయిన ఆసీస్

డెత్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయిన ఆసీస్

అయితే, దూకుడుగా ఆడే క్రమంలో ఆస్ట్రేలియా డెత్ ఓవర్లలో వరుసగా వికెట్లు చేజార్చుకొని 20-30 పరుగులకు తక్కువ చేసింది. లంక బౌలర్ ఉదాన వేసిన 49వ ఓవర్లో అలెక్స్ క్యారీ(4), కమిన్స్(0) రనౌట్ అయ్యారు. చివరి ఐదు ఓవర్లలో ఆసీస్ తక్కువ పరుగులు చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 334 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో ధనంజయ డిసిల్వా, ఇసురు ఉదాన చెరో రెండు వికెట్లు తీశారు.

1
43664

{headtohead_cricket_1_7}

Story first published: Saturday, June 15, 2019, 19:18 [IST]
Other articles published on Jun 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X