న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో చెత్త రికార్డు.. 6 పరుగులకే ఆలౌట్‌

Six all out! Mali Women Endure Record-Breaking T20I Thrashing || Oneindia Telugu
Six all out! - Mali Women endure record-breaking T20I thrashing

టీ20ల్లో మంగళవారం చెత్త రికార్డు నమోదయింది. ఓ జట్టు 6 పరుగులకే ఆలౌట్‌ అయింది. అదేంటి ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా పురుషుల మెగా టోర్నీ వన్డే ప్రపంచకప్‌ జరుగుతోంది కదా! మరి ఈ టీ20లు ఎక్కడివని ఆలోచిస్తున్నారా?. అదేంలేదండి... మహిళల అంతర్జాతీయ టీ20లో ఈ చెత్త రికార్డు నమోదైంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

క్విబుక మహిళల టి20 టోర్నీలో భాగంగా మాలి, రువాండ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన మాలి మహిళల జట్టు 9 ఓవర్లలో 6 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్‌ సమకె చేసిన ఒక్క పరుగే టాప్‌ స్కోర్‌. మిగతా తొమ్మిది మంది సున్నాకే మరిమితమయ్యారు. కౌలిబెలీ అత్యధికంగా 12 బంతులాడి డకౌటైంది.

మాలి ఇన్నింగ్స్‌లో ఒక పరుగు సమకె చేయగా.. మిగతా 5 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. ఇందులో 2 బైస్, మరో 2 లెగ్‌బైస్, ఒక వైడ్‌. రువాండ బౌలర్ జోసనే రెండు ఓవర్లు వేసి ఒక్క పరుగు ఇవ్వకుండా మూడు వికెట్లు తీసింది. 6 పరుగులకే ఆలౌట్‌ అయి మాలి జట్టు చెత్త రికార్డును తమ పేర లిఖించుకుంది.

7 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రువాండ ఓపెనర్లు కేవలం 4 బంతులాడి 8 పరుగులు చేసి గెలిచింది. దీంతో ఇంకా 116 బంతులు ఉండగానే విజయం సాధించి రువాండ రికార్డుల్లోకి ఎక్కింది. ఇది మహిళల టీ20 చరిత్రలో అత్యల్ప స్కోర్. ఇదే ఏడాది జనవరిలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో చైనా రికార్డు (14 ఆలౌట్‌)ను మాలి సవరించింది.

Story first published: Wednesday, June 19, 2019, 10:23 [IST]
Other articles published on Jun 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X