న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు: కుంబ్లే రికార్డు సమం, ఎవరీ సిదాక్ సింగ్

Sidak Singh does an Anil Kumble, claims 10-wicket haul in an innings

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన ఆటగాళ్లు ఇద్దరే ఇద్దరు. అందులో ఒకరు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జిమ్ లేకర్ కాగా, మరొకరు టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే.

<strong>ఈడెన్‌లో అరుదైన ఘనత: టీ20ల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ రికార్డు <br></strong>ఈడెన్‌లో అరుదైన ఘనత: టీ20ల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ రికార్డు

తాజాగా కల్నల్ సీకేనాయుడు అండర్-23 ట్రోఫీలో పుదుచ్చేరి బౌలర్ సిదాక్ సింగ్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అయితే, భారత్ తరుపున దేశవాళీ మ్యాచ్‌లో ఈ రికార్డును ఇంతకుముందు ముగ్గురు బౌలర్లు సాధించారు.

1954-55 సీజన్లో సుభాష్ గుప్తే, 1956-57 సీజన్‌లో ప్రేమాంగ్సు ఛటర్జీ, 2000 సీజన్‌లో దేబాశిష్ మొహంతి మాత్రమే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీశారు. తాజాగా పుదుచ్చేరిలో జరిగిన ఓ మ్యాచ్‌లో 19 ఏళ్ల సిదాక్ సింగ్ కూడా ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టాడు.

కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా పుదుచ్చేరిలోని సీఏపీ సియాచెమ్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో సిదాక్ సింగ్ అద్భుత ప్రదర్శన చేయడంతో ప్రత్యర్థి మణిపూర్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగులకే ఆలౌటైంది. 17.5 ఓవర్లు వేసిన సిదాక్ సింగ్ 31 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు.

అతని ఇన్నింగ్స్‌లో 7 మేడిన్ ఓవర్లు ఉండడం విశేషం. ఇక్కడ సిదాక్ సింగ్ చేసిన ప్రదర్శన మాజీ క్రికెటర్ల కంటే అత్యుత్తమం కావడం మరో విశేషం. ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ 53 పరుగులిచ్చి 10 వికెట్లు తీయగా, అనిల్ కుంబ్లే 74 పరుగులిచ్చి పది వికెట్లు తీశాడు.

1999లో ఫిరోజ్ షా కోట్లో వేదికగా దాయాది దేశం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు. గతంలో అండర్-16లో ఆడేటప్పుడు సిదాక్ సింగ్ ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీశాడు. సచిన్ తర్వాత అతిపిన్న వయసులో ముంబై జట్టుకు ఎంపికైన క్రికెటర్‌గా సిదాక్ సింగ్ నిలిచాడు.

Story first published: Monday, November 5, 2018, 18:50 [IST]
Other articles published on Nov 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X