న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

థ్యాంక్యూ.. యువరాజ్ భయ్యా!! ఈ క్రెడిట్ అంతా నీదే: గిల్‌

Shubman Gill credits Yuvraj Singh for preparing him well for memorable Test debut
India vs Australia : Shubman Gill Credits Yuvraj Singh For His Success In Australia

ఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ను యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణించడానికి యువరాజ్ ఇచ్చిన ట్రైనింగ్‌ ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నాడు. క్యాంప్‌లో భాగంగా వందల సంఖ్యలో షార్ట్‌ పిచ్‌ బంతులు విసిరి యూవీ తనతో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయించాడని చెప్పాడు. గబ్బా వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో అద్భుత విజయాన్నందుకున్న భారత్‌ చరిత్ర సృష్టించింది. డ్రా చేసుకుంటే గొప్పే అనుకున్న పోరులో చతేశ్వర్ పుజారా (56)‌తో కలిసి గిల్ (146 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91) మంచి పునాది వేశాడు. కడదాకా క్రీజులో నిలిచిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (89) జట్టును విజయతీరాలకు చేర్చాడు.

థ్యాంక్యూ.. యువరాజ్ భయ్యా:

థ్యాంక్యూ.. యువరాజ్ భయ్యా:

ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో శుభ్‌మన్‌ గిల్‌ మాట్లాడుతూ... 'ఐపీఎల్‌ 2020 ప్రారంభానికి ముందు యువరాజ్ ఇచ్చిన ట్రైనింగ్‌ ఎంతగానో ఉపయోగపడింది. క్యాంప్‌లో భాగంగా వందల సంఖ్యలో షార్ట్‌ పిచ్‌ బంతులు విసిరి.. నాతో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయించాడు. ముఖానికి వచ్చే బంతులను ఎలా సమర్థంగా ఆడాలనేది నేర్పించాడు. వివిధ యాంగిల్స్‌లో బంతులు విసురుతూ బ్యాటింగ్‌ స్కిల్స్‌ను మరింత మెరుగయ్యేలా చేశాడు. యూవీ ట్రైనింగ్‌తోనే ఆసీస్‌ సిరీస్‌లో రాణించా. కమిన్స్‌, హాజిల్‌వుడ్‌, స్టార్క్‌ లాంటి పేసర్ల బంతులను సమర్థంగా ఎదుర్కొగలిగాను. ఐపీఎల్‌కు కూడా యూవీ ఇచ్చిన ట్రైనింగ్‌ ఎంతగానో ఉపయోగపడింది' అని తెలిపాడు.

అమ్మ చేతి వంటను ఆస్వాధించాలనుకుంటున్నా:

అమ్మ చేతి వంటను ఆస్వాధించాలనుకుంటున్నా:

'అరంగేట్రం సిరీస్‌ను ఒక మధురానుభూతిగా మలుచుకోవడంతో మనసు ప్రశాంతంగా ఉంది. నా డెబ్యూ సిరీస్‌లోనే మంచి పరుగులు చేయడం ఆనందాన్నిచ్చింది. ఐపీఎల్‌, ఆసీస్‌ పర్యటన‌తో ఆరు నెలల పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ ఆరు నెలల్లో ఇంటి ఫుడ్‌ను చాలా మిస్సయ్యా. ఇంగ్లండ్‌తో టూర్‌ ప్రారంభానికి ముందు కొన్ని రోజులు విశ్రాంతి దొరకడంతో అమ్మ చేతి వంటను ఆస్వాధించాలనుకుంటున్నా' అని గిల్ చెప్పాడు. గిల్ బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఓపెనర్‌గా 51 యావరేజ్‌తో 259 పరుగులు చేశాడు.

తర్వాతి లక్ష్యం ఇంగ్లండ్‌ సిరీస్:

తర్వాతి లక్ష్యం ఇంగ్లండ్‌ సిరీస్:

'ఇక నా తర్వాతి లక్ష్యం ఇంగ్లండ్‌తో సిరీస్‌. ఈ సిరీస్‌లో కూడా స్థిరమైన ప్రదర్శన కనబరిచి పరుగులు రాబట్టాలని ఉత్సుకతతో ఉన్నా. జేమ్స్‌ అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జోఫ్రా ఆర్చర్‌ లాంటి సీమర్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. సిరీస్ ఇక్కడే కాబట్టి మాకు పిచ్‌లపై కొంత అవగాహన ఉంటుంది. సిరీస్ గెలవడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. యువీ భయ్యాకి మరోసారి థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నా' అని

యువ ఓపెనర్ తెలిపాడు. గిల్ భారత్ తరఫున మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 259, వన్డేల్లో 49 రన్స్ చేశాడు.

నిరాశకు గురైన గిల్ తండ్రి:

నిరాశకు గురైన గిల్ తండ్రి:

గిల్‌ సెంచరీ మిస్‌ చేసుకోవడంపై అతని తండ్రి లఖ్వీందర్‌ సింగ్‌ నిరాశకు గురైన సంగతి తెలిసిందే. 'గిల్ సెంచరీ చేస్తే అతని ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగేది. మావోడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ ఆకస్మాత్తుగా అలా శరీరానికి దూరంగా వెళ్లే బంతిని ఎందుకు వెంటాడాడో అర్థం కాలేదు. ఈ సిరీస్‌లో అతను ఆరు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. క్రీజులో చాలా సౌకర్యంగా కనిపించాడు. కానీ అతను ఔటైన విధానం నన్ను ఆందోళనకు గురిచేస్తుంది. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్‌గా వేసిన బంతులను వెంటాడి మరి వికెట్ సమర్పించుకున్నాడు. నాకు తెలిసి ఈ విషయాన్ని ఇతర జట్లన్ని ఇప్పటికే గుర్తించి ఉంటాయి. ఈ బలహీనతను గిల్ త్వరగా తెలుసుకొని అధిగమిస్తాడని, మళ్లీ ఇలాంటి తప్పిదాలు చేయడని ఆశిస్తున్నా' అని అన్నారు.

నిజం చెప్పాలంటే ఎలాంటి బాధలేదు! సిరాజ్ కోసం.. ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పా‌: శార్దూల్‌

Story first published: Saturday, January 23, 2021, 13:13 [IST]
Other articles published on Jan 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X