న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెంచరీతో చెలరేగిన శుభమాన్: దేవధర్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా-సి

Shubman Gill century powers India C to Deodhar Trophy final

హైదరాబాద్: దేళవాళీ టోర్నీలో భారత యువ క్రికెటర్ శుభమాన్ గిల్‌ సెంచరీతో చెలరేగాడు. అండర్-19 వరల్డ్ కప్‌లో సెంచరీతో వెలుగులోకి వచ్చిన శుభమాన్ గిల్ తాజాగా భారత్-ఏ జట్టుతో జరిగిన దేవధర్ ట్రోఫీలోనూ సెంచరీ సాధించాడు. శుభమాన్ గిల్ సెంచరీతో అతడు ప్రాతినిథ్యం వహిస్తోన్న భారత్-సి జట్టు టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టింది.

 కోహ్లీకి 'నో ఓవర్ స్పీడ్ చలాన్': ముంబై పోలీస్ ట్వీట్ వైరల్ కోహ్లీకి 'నో ఓవర్ స్పీడ్ చలాన్': ముంబై పోలీస్ ట్వీట్ వైరల్

ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత-ఏ జట్టు కెప్టెన్ దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు అభిమన్యు (69), అనమోల్‌ప్రీత్ సింగ్ (59)తో పాటు నితీశ్ రాణా (68) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్-సి జట్టు ఓపెనర్లు అజింక్య రహానె (14), అభినవ్ ముకుంద్ (37), సురేశ్ రైనా (2) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన మరో యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ (69)తో కలిసి నిలకడగా ఆడిన శుభమన్ గిల్ (106 నాటౌట్: 111 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులు) అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

మెస్సీ చిరునవ్వులు: పుట్‌బాల్‌లో ఇలా కూడా బంతిని అడ్డుకోవచ్చా?మెస్సీ చిరునవ్వులు: పుట్‌బాల్‌లో ఇలా కూడా బంతిని అడ్డుకోవచ్చా?

వీరిద్దరి జోడీ నాలుగో వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. జట్టు స్కోరు 206 వద్ద ఇషాన్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (56 నాటౌట్: 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపు హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్-సి జట్టు 47 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులతో విజయం సాధించింది.

Story first published: Thursday, October 25, 2018, 19:15 [IST]
Other articles published on Oct 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X