న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Team India : నాకు షార్ట్ బాల్ సమస్య లేదు.. అది వాళ్లు సృష్టించిన రూమర్ : శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer says he does not have short ball problem

అంతర్జాతీయ క్రికెట్‌లో షార్ట్ బాల్ సమస్య అత్యంత ఎక్కువగా ఉన్న ఆటగాడు శ్రేయాస్ అయ్యర్, ముఖ్యంగా టీ20ల్లో ఈ సమస్య అతన్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఈ కారణంగానే టీ20 వరల్డ్ కప్‌ ఆడే జట్టుకు అతన్ని ఎంపిక చేయలేదు అనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే వరల్డ్ కప్ జరిగింది ఆస్ట్రేలియాలో. అక్కడ పేసర్లకు మంచి బౌన్స్, పేస్ లభిస్తాయి. అలాంటి చోటు అయ్యర్‌ను ఆడిస్తే ఒక బ్యాటర్ తక్కువగా బరిలో దిగినట్లే.

షార్ట్ బాల్‌కు వికెట్ పారేసుకోవడం..

షార్ట్ బాల్‌కు వికెట్ పారేసుకోవడం..

శ్రేయాస్ అయ్యర్ ఆడిన టెస్టు మ్యాచులు, వన్డేలు, టీ20లు ఏవి చూసినా ఈ షార్ట్ బాల్ సమస్య చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఐపీఎల్‌లో కూడా క్రీజులో అతను కనిపించగానే బౌలర్లు షార్ట్ బాల్‌తో ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో కూడా అయ్యర్ రాగానే షార్ట్ బాల్స్‌తో అతన్ని బెంబేలెత్తించిన ఇంగ్లిష్ బౌలర్లు అతన్ని తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చారు. ఇలా షార్ట్ బాల్ సమస్యతో తెగ ఇబ్బంది పడిపయిన అయ్యర్ మాత్రం తనకు అలాంటి సమస్యే లేదని వాదిస్తున్నాడు.

నాకు ఆ సమస్యే లేదు..

నాకు ఆ సమస్యే లేదు..

స్పిన్నర్లను కానీ, మిగతా బంతులను కానీ అయ్యర్ అద్భుంగా ఆడతాడు. అవసరానికి తగ్గట్లే ఆటలో వేగం చూపించే అతను.. షార్ట్ బాల్స్ వేస్తే మాత్రం పెవిలియన్ బాట పట్టడం గ్యారంటీ అని ప్రత్యర్థులకు తెలుసు. ఈ సమస్య ఉన్నా కూడా వన్డే, టెస్టు ఫార్మాట్లలో టీమిండియాలో తన చోటుకు అయ్యర్ పదిలం చేసుకున్నాడు. వన్డేల్లో భారత్ తరఫున ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన అతను తనకు షార్ట్ బాల్ సమస్యే లేదని స్పష్టం చేశాడు.

బయటి వాళ్ల సృష్టే..

బయటి వాళ్ల సృష్టే..

'ఈ సమస్యను బయటి వాళ్లే సృష్టించారు. చాలా మంది ఆటగాళ్ల కెరీర్‌లో ఇలాంటి ఫేజ్ ఉంటుంది. ఏదో ఒక రకంగానే వాళ్లు అవుటవడం ఒక ఫేజ్‌లో సహజం. నాక్కూడా అలాగే జరిగింది. నన్ను ఈ బయటి గొడవతో బాగా టార్గెట్ చేశారు. నేను వాళ్లందర్నీ తప్పు అని నిరూపించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత నాకు అర్థమైంది. నాకు అలాంటి సమస్యేమీ లేదని. నేను ప్రస్తుతంలో బతకడానికి చాలా ఇష్టపడతా. నా నైపుణ్యాలు, టెక్నిక్స్‌పై శ్రమించడం అంటే నాకు పిచ్చి ప్రేమ' అని అయ్యర్ వివరించాడు. మైదానం బయట గొడవ వల్లనే తనకు షార్ట్ బాల్ సమస్య ఉన్నట్లు ప్రచారం జరిగిందన్నాడు.

బంగ్లా సిరీస్‌లో సూపర్ శ్రేయాస్..

బంగ్లా సిరీస్‌లో సూపర్ శ్రేయాస్..

బంగ్లాదేశ్ టెస్టు సిరీసులో అయ్యర్ అద్భుతంగా రాణించాడు. ఎంతగా అంటే 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అతనికి ఇవ్వలేదని చాలా మంది అభిమానులు వాళ్లను బండ బూతులు తిట్టారు. ఈ మ్యాచ్‌లో మూడు ఇన్నింగ్సులు ఆడిన అయ్యర్.. రెండుసార్లు 80పైగా పరుగులు చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.

దీంతో ఇలా ఒక స్పష్టమైన సమస్య ఉన్న ఆటగాడు.. జట్టులో చోటు ఎలా సుస్థిరం చేసుకున్నాడా? అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో షార్ట్ బాల్స్‌ను ఎదుర్కోవడానికి ఎలా సిద్ధమయ్యారు? అని ప్రశ్నించగా అయ్యర్ బదులిచ్చాడు.

ప్రాక్టీస్‌లో కూడా అదే..

ప్రాక్టీస్‌లో కూడా అదే..

'నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేటప్పుడు స్పిన్నర్లు, సైడ్ ఆర్మ్ పేసర్లు నాకు షార్ట్ బాల్స్ వేయడానికి ప్రయత్నించారు. నేను వాటిని మిడ్ వికెట్ వైపుగా ఆడేందుకు ట్రై చేశా. అన్ని బంతులను చక్కగా టైమ్ చేయగలిగా. దీంతో నాకు మంచి కాన్ఫిడెన్స్ పెరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు షార్ట్ బాల్స్‌తో నాపై బంగ్లా బౌలర్లు దాడి చేశారు. ఆరంభంలో కొన్ని బంతులు వదిలేశా.. కానీ నా సహజమైన ఆటను నమ్మా. దీంతో ఆటోమేటిక్‌గా ఏ బంతిని ఎలా ఆడాలో ఆ స్టాన్స్ వచ్చేసింది. టెస్టు మ్యాచుల్లో అదే కదా చూడాలని అనుకుంటాం' అని అయ్యర్ వివరించాడు.

Story first published: Thursday, January 5, 2023, 13:42 [IST]
Other articles published on Jan 5, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X