న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిన్న కనేరియాపై వివక్ష... నేడు వసీం అక్రమ్ వీడియో: షోయబ్ అక్తర్ మరో దుమారం!

Shoaib Akhtar shares ‘leaked video’ of Wasim Akram, says ‘I support him’

హైదరాబాద్: గత రెండు రోజులుగా క్రీడావర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు షోయబ్ అక్తర్. భారత్‌లో పౌరసత్వ సవరణ బిల్లుపై ఆందోళనలు జరుగుుతున్న సమయంలో పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియాను జట్టులోని సహచర క్రికెటర్లు వివక్షకు గురిచేశారన్న వ్యాఖ్యలతో షోయబ్ అక్తర్ కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు.

డానిష్ కనేరియా వివక్ష వివాదం ముగియక ముందే తాజాగా పాకిస్థాన్ మాజీ పేస్ దిగ్గజం వసీం అక్రమ్‌కి సంబంధించిన ఒక వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసి మరో దుమారం లేపాడు. అక్తర్‌ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియోలో వసీం అక్రమ్ పాకిస్థాన్‌ క్రికెట్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మాట్లాడతాడు.

నాలుగు దేశాలతో 'వన్డే సూపర్ సిరిస్': గంగూలీపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ప్రశంసల వర్షంనాలుగు దేశాలతో 'వన్డే సూపర్ సిరిస్': గంగూలీపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ప్రశంసల వర్షం

ఇది మన క్రికెట్‌ను ధ్వంసం చేస్తుంది

"గతంలో ఎలాగైతే జరిగిందో అచ్చం అదే విధంగా ఇప్పుడు జరుగుతోంది. ఇది మన క్రికెట్‌ను ధ్వంసం చేస్తుంది. ఈ విధానంలో మార్పు తెచ్చేందుకు కొత్త పద్ధతులను అవలంబించాలి. మన ఆలోచనా విధానాలు కూడా మారాలి. అందుకోసం కొత్తగా ప్రయత్నించాలి" అని అక్రమ్ చెప్పుకొచ్చాడు.

వసీం అక్రమ్‌ మాటలను సమర్థిస్తున్నా

ఈ వీడియోని పోస్టు చేసిన అక్తర్‌ వసీం అక్రమ్‌ మాటలను సమర్థిస్తున్నానని అన్నాడు. పాక్ క్రికెట్‌లో మార్పులు అవసరమని చెప్పాడు. అంతకముందు కనేరియా హిందువు కాబట్టి కొందరు క్రికెటర్లు అతడితో కలిసి భోజనం కూడా చేసే వాళ్లు కాదని షోయబ్‌ అక్తర్‌ తెలిపాడు. ఈ వీడియో గురువారం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయింది.

షోయబ్ అక్తర్ మాట్లాడుతూ

షోయబ్ అక్తర్ మాట్లాడుతూ

ఓ టీవీ షోలో పాల్గొన్న షోయబ్ అక్తర్ మాట్లాడుతూ "నా కెరీర్‌లో ప్రాంతీయతపై మాట్లాడటం ప్రారంభించినప్పుడు జట్టులోని ఇద్దరు ముగ్గురి ఆటగాళ్లతో నేను విభేదించేవాణ్ని. కరాచి నుంచి ఎవరు ఉన్నారు.. పంజాబ్‌ లేదా పెషావర్‌ నుంచి ఎవరైనా ఉన్నారా? లాంటి మాటలు తీవ్రమైన కోపం తెప్పించేవి. జట్టు కోసం మంచి ప్రదర్శన చేస్తున్న ఆటగాడు హిందువు అయితే తప్పేంటి? కనేరియా మద్దతు లేకుంటే ఇంగ్లాండ్‌పై మేం టెస్టులు గెలిచేవాళ్లం కాదు. కానీ, ఆ ఘనత అతనికి దక్కకుండా చేశారు" అని అన్నాడు.

అక్తర్‌ వ్యాఖ్యలను సమర్థించిన కనేరియా

అక్తర్‌ వ్యాఖ్యలను సమర్థించిన కనేరియా

"నేను ఆడుతున్న రోజుల్లో ఈ విషయం గురించి మాట్లాడే ధైర్యం లేకపోయింది. ఇప్పుడు అక్తర్‌ చెబుతున్న మాటలు నిజం. అతనితో పాటు ఇంజమాముల్‌ హక్‌, మహమ్మద్‌ యూసుఫ్‌, యూనిస్‌ ఖాన్‌ నాకు మద్దతుగా నిలిచేవాళ్లు" అని కనేరియా తెలిపాడు. తన మామ అనిల్‌ దల్పాత్‌ తర్వాత పాకిస్థాన్ జట్టు తరపున ఆడిన రెండో హిందువుగా కనేరియా నిలిచాడు. పాక్ తరుపున 61 టెస్టులు ఆడి 261 వికెట్లు తీయడంతో పాటు 18 వన్డేలకు కూడా ప్రాతినిథ్యం వహించాడు.

Story first published: Saturday, December 28, 2019, 15:02 [IST]
Other articles published on Dec 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X