న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: ఈ సారి భారత్‌ను ఓడించడం పాకిస్థాన్‌కు కష్టమే: షోయబ్ అక్తర్‌

Shoaib Akhtar says It will not be easy for Pakistan to beat India in T20 World Cup this time

కరాచీ: ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియాపై పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా చాలా పటిష్టంగా కనిపిస్తుందని, అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ సేనను ఓడించడం పాకిస్థాన్‌కు తేలికైన విషయం కాదని అభిప్రాయపడ్డాడు. గత ప్రపంచకప్ మాదిరి భారత్‌ను పాక్ ఓడించలేదని చెప్పాడు.

ఇక దుబాయ్ వేదికగా జరిగిన గత టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను పాక్ 10 వికెట్లతో చిత్తుగా ఓడించి చరిత్ర తిరగరాసింది. ఈ మ్యాచ్ ముందు వరకు మెగాఈవెంట్‌లో భారత్‌ను ఓడించిన చరిత్ర పాక్‌కు లేదు. ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌‌లోనూ ఇరు జట్లు తొలి మ్యాచ్‌లోనే తలపడనున్నాయి.

పాక్‌కు అంత ఈజీకాదు..

పాక్‌కు అంత ఈజీకాదు..

ఈ నేపథ్యంలోనే క్రికెట్ పాకిస్థాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఈ సారి టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించడం పాకిస్థాన్‌కు తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఈసారి టీమిండియా సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతది. పైగా ఆ జట్టు చాలా పటిష్టంగా మారింది. అయితే ఇప్పుడే విజేతను అంచనా వేయం కష్టం. భారత్-పాక్ మ్యాచ్ జరిగే మెల్‌బోర్న్‌ పిచ్‌ పాతబడే కొద్ది బౌన్స్‌కు సహకరిస్తోంది.

ముందు బ్యాటింగ్ చేయాలి..

ముందు బ్యాటింగ్ చేయాలి..

అది ఫాస్ట్‌ బౌలర్లకు అడ్వాంటేజ్‌గా మారుతోంది. కాబట్టి టాస్‌ గెలిస్తే పాకిస్థాన్‌ తొలుత బౌలింగ్‌ చేయకూడదు. మొదట బ్యాటింగ్‌ చేస్తే మెరుగైన ఫలితం పొందవచ్చు'అని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఇక భారత్- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా దాదాపు లక్షా యాభై వేల మంది ప్రేక్షకులు మెల్‌బోర్న్‌ గ్రౌండ్‌కు వచ్చే అవకాశం ఉందని అక్తర్‌ అంచనా వేశాడు. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ అయిపోయాయి.

అఫ్రిది సైతం..

అఫ్రిది సైతం..

ఎప్పుడూ భారత్‌పై సోషల్ మీడియా వేదికగా అక్కసు వెళ్లబోసుకొనే పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్ అఫ్రిది కూడా టీమిండియా విజయాన్ని అభినందించాడు. ఆసీస్‌ వేదికగా మరో మూడు నెలల్లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌ను సాధించే అవకాశం ఉన్న జట్లలో టీమిండియా ఒకటని అఫ్రిది కొనియాడాడు. 'ఇంగ్లండ్‌పై భారత్‌ అద్భుతంగా ఆడింది.

సిరీస్‌ను దక్కించుకునేందుకు అన్ని అర్హతలు టీమిండియాకు ఉన్నాయి. మరీ ముఖ్యంగా బౌలింగ్‌ ప్రదర్శన అద్భుతం. అందుకే చెబుతున్నా.. ఆసీస్‌ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ ఫేవరేట్స్‌లో భారత్‌ తప్పకుండా ఉంటుంది'అని షాహిద్‌ అప్రిది ట్వీట్ చేశాడు. భారత్ సిరీస్ విజయాన్ని ప్రస్తావిస్తూ ఐసీసీ షేర్‌ చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ అఫ్రిది ఈ కామెంట్స్ చేశాడు.

ఐసీసీ టోర్నీల్లోనే..

ఐసీసీ టోర్నీల్లోనే..

ఇక ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలతో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలో మాత్రమే తలపడుతున్నాయి. దాంతో ఈ ఇరు దేశాల పోరుకు మరింత క్రేజ్ ఏర్పడింది. ఇక ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లోనూ ఇరు దేశాలు తమ తొలి మ్యాచ్‌లోనే తలపడనున్నాయి. అయితే ఈ మెగాటోర్నీకి ముందే ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఆగస్టు 28న భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.

Story first published: Monday, July 11, 2022, 14:26 [IST]
Other articles published on Jul 11, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X