న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌గా పనికిరాడు: సర్ఫరాజ్‌ను మరోసారి టార్గెట్ చేసిన అక్తర్

Shoaib Akhtar Again Slams On Sarfraz Ahmed And Urges PCB To Act || Oneindia Telugu
Shoaib Akhtar launches fresh attack on Pakistan captain Sarfraz Ahmed and urges PCB to act


హైదరాబాద్: అన్ని ఫార్మాట్లలో పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ డిమాండ్ చేశాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌ లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టు ప్రక్షాళన దిశగా ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) దృష్టి సారించింది.

మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్

టోర్నీలో భాగంగా వెస్టిండిస్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో భారీ పరుగుల తేడాతో ఓడిపోవడం... శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం... పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను ఘోరంగా దెబ్బతీశాయి. పాకిస్థాన్-న్యూజిలాండ్ జట్లు పాయింట్ల పరంగా సమం అయినప్పటికీ నెట్ రన్‌రేట్ పరంగా న్యూజిలాండ్ సెమీస్‌కు చేరింది.

లీగ్ స్టేజిలోనే పాక్ నిష్క్రమణ

లీగ్ స్టేజిలోనే పాక్ నిష్క్రమణ

లీగ్ స్టేజిలోనే పాక్ వరల్డ్‌కప్ నిష్క్రమణతో టెస్టు, పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లతో పాటు కోచ్‌లను నియమించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టుకు కొత్తగా ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో షోయబ్ అక్తర్ బోర్డుకు సూచించాడు. హరీస్ సోహాలీని పాక్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌‌ను చేస్తే సత్ఫలితాలు ఉంటాయని పేర్కొన్నాడు.

టెస్ట్ ఫార్మాట్‌కు బాబర్ అజమ్‌ను కెప్టెన్‌గా

టెస్ట్ ఫార్మాట్‌కు బాబర్ అజమ్‌ను కెప్టెన్‌గా

వన్డే, టీ20 ఫార్మాట్‌లకు సోహాలీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాలని, టెస్ట్ ఫార్మాట్‌కు బాబర్ అజమ్‌ను కెప్టెన్‌గా చేయాలని షోయబ్ అక్తర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే, సర్ఫరాజ్ ఆహ్మద్‌ను వికెట్ కీపర్‌గా కొనసాగించాలని, అతని బ్యాటింగ్ నైపుణ్యాన్ని జట్టు వినియోగించుకోవాలని అక్తర్ సూచించడం విశేషం.

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో సర్ఫరాజ్ అహ్మద్ సైతం పేలవ ప్రదర్శన చేశాడు. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 13 క్యాచ్‌లు పట్టిన సర్ఫరాజ్ అహ్మద్ 28.60 యావరేజితో 143 పరుగులు చేశాడు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

సర్ఫరాజ్ కెప్టెన్సీపై విమర్శలు

సర్ఫరాజ్ కెప్టెన్సీపై విమర్శలు

ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడంతో సర్ఫరాజ్ కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు ప్రక్షాళన దిశగా ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) దృష్టి సారించింది. పీసీబీ ఉన్నతాధికారి మాట్లాడుతూ "టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సీజన్‌లో శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ టెస్టులన్నీ కూడా వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఆడేవే" అని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న పాక్.. వన్డేల్లో ఆరో స్థానంలో, టెస్టుల్లో 7వ స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Thursday, July 25, 2019, 12:29 [IST]
Other articles published on Jul 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X