న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రతిరోజు అలా చేయడం కష్టంగా ఉంది: ధావన్

Shikhar Dhawan Says Getting Zoraver Out Of Bed Every Morning Is The Toughest Task

ఢిల్లీ: కరోనా వైరస్ లాక్‌డౌన్‌ సమయాన్ని అత్యంత సద్వినియోగం చేసుకుంటున్న టీమిండియా క్రికెటర్లలో శిఖర్ ధావన్‌ ముందున్నాడు. ఆడుతూ.. పాడుతూ.. కసరత్తులు చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో ఎన్నడూ లేనంతగా సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ముఖ్యంగా తన కుమారుడు జోరావర్‌తో సరదాగా కాల క్షేపం చేస్తున్నాడు. సమయం చిక్కినప్పుడల్లా అతడితో గడిపిన క్షణాలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటున్నాడు.

నిద్ర లేపడం చాలా కష్టంగా ఉంది:

నిద్ర లేపడం చాలా కష్టంగా ఉంది:

తన కుమారుడు జొరావర్‌కు సంబందించిన ఓ ఫొటోను గురువారం శిఖర్ ధావన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ ఫొటోకు కాప్షన్ ఇలా రాసుకొచ్చాడు. 'రోజు ఉదయం జోరావర్‌ను పడక మీద నుంచి నిద్ర లేపడం చాలా కష్టంగా ఉంది. అయినా అప్పుడప్పుడూ ఇలాంటి సరదా సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. అవి ఎంతో బాగుంటాయి' అని గబ్బర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతర్జాతీయ కెరీర్‌లో గబ్బర్ ఇప్పటివరకు 34 టెస్టుల్లో, 136 వన్డేల్లో, 61 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

కొడుక్కి అన్నీ నేర్పిస్తున్నాడు

ప్రస్తుతం ఖాళీ సమయం దొరకడంతో గబ్బర్‌ తన కొడుక్కి అన్నీ నేర్పిస్తున్నాడు. ఇంటి పనుల్లో సాయం చేయిస్తున్నాడు. సైకిల్‌ తొక్కడం నేర్పిస్తున్నాడు. ఇంకా పరుగెత్తిస్తున్నాడు. మూగజీవాలకు ఆహారం అందించడం నేర్పించాడు. ఇక కొన్ని రోజుల ముందు ట్రిమ్మర్‌తో తన జట్టును స్టైలిష్‌గా చేయించుకున్నాడు. కొన్ని పాటలకు ఇద్దరూ కలిసి చిందులు వేశారు. ఆ మధ్య తన సతీమణి ఆషేయాను డాన్స్‌ చేయాలని కోరగా.. ఆమె నిరాకరించారు. దాంతో 'భార్యను ఒప్పించాలంటే కొడుకు సహాయం ఉండాల్సిందే' అని చమత్కరించాడు.

ఇక అవకాశం రాకపోవచ్చు:

ఇక అవకాశం రాకపోవచ్చు:

2013లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా భారత్ తరఫున శిఖర్ ధావన్‌ అరంగేట్రం చేశాడు. ఆరంభ మ్యాచ్‌లోనే భారీ సెంచరీ (177) సాధించి ఔరా అనిపించాడు. టెస్టు ఓపెనర్‌గా మొత్తం 34 టెస్టుల్లో 40.61 సగటుతో 2,315 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు ఉన్నాయి. అయితే 2018 తర్వాత టెస్టుల్లో ధావన్‌ ప్రదర్శన అంతకంతకు దిగజారడంతో.. ఏకంగా జట్టులోనే చోటు కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తీవ్ర పోటీ ఎదురవడంతో తిరిగి జట్టులోకి ఎంపిక కాలేదు. 2018 ఇంగ్లండ్‌ పర్యటనలో ఓవల్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధావన్‌ చివరిసారిగా ఆడాడు.

మెగా టోర్నీలో ఎలా రెచ్చిపోతాడో చూడాలి:

మెగా టోర్నీలో ఎలా రెచ్చిపోతాడో చూడాలి:

ఇక చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన శిఖర్ ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (రాజ్‌కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్‌ నుంచి ధావన్ గాయపడడం అది నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. ఆపై కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి. త్వరలోనే ఐపీఎల్‌ 2020 ప్రారంభమవుతున్న నేపథ్యంలో ధావన్‌ మళ్లీ సాధన మొదలెట్టే అవకాశం ఉంది. మెగా టోర్నీలో ఎలా రెచ్చిపోతాడో చూడాలి.

Story first published: Friday, July 31, 2020, 13:37 [IST]
Other articles published on Jul 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X