న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాకే సొంతమైన చిన్నారితో..‌ ఇంట్లోనే మేకప్‌!!

Shikhar Dhawan Gets His Lockdown Makeup Done By Son Zoraver

ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ సమయాన్ని అందరిలానే టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. భార్య అయేషా, కొడుకు జొరావర్‌తో కలిసి గబ్బర్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు ఇందుకు సంబంధించిన కొన్ని వీడియో, ఫొటోలు గబ్బర్ సోషల్ ‌మీడియా ద్వారా పంచుకుంటూ.. తన అభిమానులకు నిరంతరం టచ్‌లో ఉంటున్నాడు.

యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు.. టార్గెట్ రోహిత్ శర్మ‌ కూడా!!యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు.. టార్గెట్ రోహిత్ శర్మ‌ కూడా!!

శిఖర్ ధావన్‌ ఇటీవల తన ఇన్‌స్టా ఖాతాలో ఓ సరదా వీడియోను షేర్‌ చేశాడు. అందులో గబ్బర్‌కు ఆయన కొడుకు మేకప్‌ వేస్తున్నాడు. మైదానంలో బ్యాట్‌తో పరుగులు పారించే ధావన్... కొడుకు దగ్గర ఓపిగ్గా మేకప్‌ చేయించుకుంటున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకి 'నాకే సొంతమైన చిన్నారి జోరావర్‌.. ఇంట్లోనే చేసిన మేకప్‌తో ఫన్‌' అంటూ కాఫ్టన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

గతంలో కూడా తన కొడుకుతో పాటు డ్యాన్స్‌ చేస్తూ షేర్‌ చేసిన వీడియోకు... ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా కూడా ఫిదా అయ్యాడు. ఆ వీడియోలో మొదటగా ధావన్ ఓ పాటకు డాన్స్ చేస్తుండగా.. మధ్యలో జొరావర్ రాగానే మరో సాంగ్ వచ్చింది. ఇలానే రెండు చేసి.. చివరకు ఇద్దరు కలిసి ఒకే పాటకు డాన్స్ చేసారు. ధావన్ భారత్ తరఫున 34 టెస్టులు, 136 వన్డేలు 61 టీ20లు ఆడాడు. ధావన్‌ పేరు ప్రతిష్టాత్మక అర్జున పురస్కారానికి బీసీసీఐ నామినేట్‌ చేసిన సంగతి తెలిసిందే.

చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (రాజ్‌కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్‌ నుంచి ధావన్ గాయపడడం నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి. ఇప్పడు ఏకంగా మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు.

బ్యాటు, బంతి మధ్య సమతూకం కోసం పిచ్‌లను ఉపయోగించుకోండి: కుంబ్లేబ్యాటు, బంతి మధ్య సమతూకం కోసం పిచ్‌లను ఉపయోగించుకోండి: కుంబ్లే

Story first published: Thursday, June 4, 2020, 18:06 [IST]
Other articles published on Jun 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X