న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పూర్తిగా కోలుకున్న ధావన్.. వెస్టిండీస్ టూర్‌కు సిద్ధం

Shikhar Dhawan fully fit and available selection for West Indies tour


ముంబై: వెస్టిండీస్‌ పర్యటన కోసం ఆదివారం సెలక్టర్లు భారత జట్టును ప్రకటించనున్నారు. దాదాపుగా నెల రోజులకు పైగా విశ్రాంతి తీసుకున్న టీమిండియా రెగ్యులర్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని సమాచారం తెలుస్తోంది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్‌ పర్యటనకు ధావన్ సిద్ధంగా ఉన్నాడు. చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో ఆదివారం వెస్టిండీస్‌ టూర్‌కు జట్టుని ప్రకటించనున్న నేపథ్యంలో ధావన్‌కు స్థానం దక్కే అవకాశం ఉంది.

ఆరంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ ఓటమి.. బోణీ కొట్టిన యుముంబా, బెంగళూరుఆరంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ ఓటమి.. బోణీ కొట్టిన యుముంబా, బెంగళూరు

చేతి వేలికి గాయం:

చేతి వేలికి గాయం:

ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ధావన్ చేతి వేలికి గాయమైన విషయం తెలిసిందే. పేస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ వేసిన బౌన్సర్ ధావన్ వేలికి తాకడంతో గాయం అయింది. గాయంతోనే ధావన్ తన ఇన్నింగ్స్ కొనసాగించాడు. 109 బంతుల్లో 117 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో తన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆసీస్‌పై 36 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఆరు వారాల విశ్రాంతి:

ఆరు వారాల విశ్రాంతి:

మ్యాచ్ అనంతరం గాయం తీవ్రత ఎక్కువ అయింది. పరీక్షల అనంతరం ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో అతడు ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అక్కడే ఉంది చికిత్స చేయించుకున్నాడు. ధావన్‌ స్థానంలో ఓపెనింగ్‌ బాధ్యతలు కేఎల్‌ రాహుల్‌ చేపట్టాడు. మరో ఓపెనర్ రోహిత్‌ శర్మతో కలిసి రాహుల్‌ విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

నెట్స్‌లో ప్రాక్టీస్:

నెట్స్‌లో ప్రాక్టీస్:

విశ్రాంతి అనంతరం ధావన్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. మూడు రోజుల కిందట ధావన్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేసాడు. అంతేకాదు యువరాజ్ సింగ్ విసిరిన 'బాటిల్ క్యాప్ చాలెంజ్‌' సవాల్ స్వీకరించి గెలిచాడు. ధావన్ బంతిని స్ట్రెయిట్ డ్రైవ్ ఆడి బాటిల్ క్యాప్ పడగొట్టాడు. ఒకవేళ ధావన్ జట్టులోకి ఎంపికయితే కేఎల్ రాహుల్‌ మళ్లీ నాలుగో స్థానానికి వెళ్లే అవకాశముంది.

Story first published: Sunday, July 21, 2019, 13:33 [IST]
Other articles published on Jul 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X