న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

5000: నేపియర్ వన్డేలో అరుదైన ఘనత సాధించిన శిఖర్ ధావన్

Ind vs NZ,1st ODI : Shikhar Dhawan Became The Second Fastest Indian To Reach 5000 Runs | Oneindia
Shikhar Dhawan emulates Brian Lara, joint-fastest left-handed batsman to 5,000 ODI runs

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా నేపియర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ధావన్ వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా ఐదువేల పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా ధావన్ నిలిచాడు.

118 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని

118 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని

విరాట్ కోహ్లీ 114 మ్యాచ్‌ల్లో ఐదువేల పరుగుల మైలురాయిని అందుకోగా, శిఖర్ ధావన్ 118 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ వన్డేకు ముందు పది పరుగుల దూరంలో ఉన్న శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో టిమ్ సౌథీ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఐదువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా

వన్డేల్లో అత్యంత వేగంగా

వన్డేల్లో అత్యంత వేగంగా ఐదువేల పరుగుల మైలురాయిని అందుకున్న వారి జాబితాలో హషీం ఆమ్లా (101 మ్యాచ్‌లు), వివియన్ రిచర్డ్స్ (114), విరాట్ కోహ్లీ (114) తొలి మూడు స్థానాల్లో ఉండగా.. బ్రయాన్ లారా (118)తో కలిసి ధావన్ నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు.

లారాతో కలిసి అగ్రస్థానంలో

ఇక, ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్ విషయానికి వస్తే సౌరవ్ గంగూలీ, గ్రేమ్ స్మిత్‌లను దాటేసి బ్రియాన్ లారాతో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2010లో ఆస్ట్రేలియాపై వన్డే అరంగేట్రం చేసిన శిఖర్ ధావన్ ఇప్పటివరకు 15 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు సాధించాడు.

Story first published: Wednesday, January 23, 2019, 13:56 [IST]
Other articles published on Jan 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X