న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎంతో స్ఫూర్తినిస్తాడు: ధోనికి సెల్యూట్ చేసిన షెల్డన్ కాట్రెల్ (వీడియో)

Sheldon Cottrell Salutes MS Dhoni’s ‘Inspirational Love For Country And Partner’ || Oneindia Telugu
Sheldon Cottrell salutes MS Dhoni’s ‘inspirational love for country and partner’

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై తన అభిమానాన్ని వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నాడు వెస్టిండిస్ క్రికెటర్ షెల్డన్ కాట్రెల్. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో వికెట్ తీసిన సమయంలో షెల్డన్ కార్టెల్ ఆర్మీ సెల్యూట్‌ చేస్తూ వినూత్నంగా సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

జమైకా ఆర్మీలో పనిచేసి అనంతరం వెస్టిండిస్ జట్టులోకి అడుగుపెట్టిన కాట్రెల్‌ వికెట్లు తీసిన సందర్భంలో ఆర్మీకి గౌరవ సూచికంగా సెల్యూట్‌ చేస్తున్నానని పేర్కొన్నాడు. కాగా, వెస్టిండిస్ పర్యటనకు అందుబాటులో లేకుండా రెండు నెలలు పారామిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేయాలని టీమిండియా మాజీ కెప్టెన్ ధోని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

భారత ఆర్మీపై ధోనీకి ఉన్న అంకితభావం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. "మైదానంలో ధోనీ ఎంతో స్ఫూర్తినిస్తాడు. అతను గొప్ప దేశభక్తుడు కూడా. దేశానికి సేవ చేయాలని అతనికి ఉన్న అంకితభావం అమోఘం. గత కొన్ని వారాలుగా నేను మా ఆటగాళ్లతో ఉన్నాను" అని తన తొలి ట్వీట్ చేశాడు.

ఇక, రెండో ట్వీట్‌లో రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ చేతుల మీద ధోనీ అందుకున్న పద్మ భూషణ్‌ వీడియోను కాట్రెల్‌ షేర్‌ చేస్తూ "ఈ వీడియోని స్నేహితులు, కుటుంబ సభ్యులకి షేర్‌ చేస్తున్నాను. ఎందుకంటే అటువంటి క్షణాన్ని నేను ఎంత గర్విస్తానో వాళ్లకి తెలుసు. ఆ క్షణంలో ధోనీ, అతని భార్య సాక్షిని చూస్తుంటే జీవిత భాగాస్వామిపై, దేశం పట్ల ఉన్న ప్రేమ ప్రతిబింబిస్తుంది"అని తెలిపాడు.

తన రెండు నెలల సైనిక శిక్షణను ధోని గత గురువారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. పారాచూట్‌ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోని బుధవారం బెటాలియన్‌తో కలిసి లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ బాధ్య‌త‌లు స్వీకరించాడు. జులై 31 నుంచి ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు 106 టెరిటోరియ‌ల్ ఆర్మీ బెటాలియ‌న్‌తో క‌లిసి ధోనీ ప‌నిచేయ‌నున్నాడు.

క‌శ్మీర్‌లో ఉన్న విక్ట‌ర్ ఫోర్స్‌తో ధోనీ క‌ల‌వ‌నున్నాడు. అక్కడ పారాచూట్ రెజిమెంట్‌తో శిక్షణ ప్రారంభిస్తాడు. సైన్యం ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి వచ్చాక ధోని పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్ డ్యూటీల‌ను ధోనీ నిర్వర్తించనున్నాడు.

Story first published: Monday, July 29, 2019, 14:29 [IST]
Other articles published on Jul 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X