న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెలరేగిన సన్‌రైజర్స్.. ఎవరన్నారు కేవలం బౌలింగ్ జట్టని?, గుజరాత్ ముందు భారీ లక్ష్యం

shashank singh super batting.. sunrisers got huge score

ఐపీఎల్ 2022 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది.

ఇక సన్ రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ ( 65పరుగులు 42బంతుల్లో 6ఫోర్లు 3సిక్సర్లు), మార్క్రామ్ (56పరుగులు 40బంతుల్లో 2ఫోర్లు 3సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా... చివర్లో శశాంక్ సింగ్ ( 25పరుగులు 6బంతుల్లో 1ఫోర్, 3సిక్సర్లు) చెలరేగడంతో 20ఓవర్లకు 6వికెట్లు కోల్పోయి 195పరుగులు చేసింది. చివరి ఓవర్ మూడు బంతులకు సన్ రైజర్స్ కొత్త బ్యాటర్ శశాంక్ సింగ్ మూడు హ్యాట్రిక్ సిక్సులు బాదాడం ఈ మ్యాచ్‌కే హైలెట్ అని చెప్పొచ్చు.

తొలి ఓవర్ వేసిన షమీ.. రెండు లాంగ్ వైడ్‌లు వేయడంతో అవి బౌండరీలుగా మారడంతో ఎస్ఆర్‌హెచ్‌కు ఆ ఓవర్లో 11పరుగులు వచ్చాయి. యష్ దయాళ్ వేసిన రెండో ఓవర్లో 2ఫోర్లతో ఓపెనర్ అభిషేక్ శర్మ తన దూకుడు మొదలెట్టాడు. తర్వాతి ఓవర్ షమీ బౌలింగ్ వేయగా.. ఫోర్ కొట్టిన విలియమ్సన్(5పరుగులు) టచ్‌లోకి వచ్చాడనుకుంటే బౌల్డ్ అయ్యాడు. నంబర్ 3గా క్రీజులోకి వచ్చిన త్రిపాఠి(16పరుగులు) ఇచ్చిన సులువైన క్యాచ్‌ను రషీద్ జారవిడిచాడు. ఇక వరుసగా షమీ వేసిన మూడో స్పెల్ 5ఓవర్లో త్రిపాఠి ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. కానీ ఎల్బీడబ్ల్యూగా షమీ అతన్ని పెవిలియన్‌కు పంపించాడు. రివ్యూ తీసుకోవడంలో హార్దిక్ తెలివిగా వ్యవహరించాడు. తర్వాత బ్యాటింగ్‌కొచ్చిన మార్క్రామ్ అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరు 3వ వికెట్‌కు 96పరుగుల భాగస్వామ్యం అందించారు. స్వేచ్ఛగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

రషీద్ ఖాన్ వేసిన వరుస ఓవర్లలో అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. మొత్తంగా రషీద్ బౌలింగ్లో 3సిక్సర్లు, 1ఫోర్లు దండుకున్నాడు. అభిషేక్, మార్క్రామ్ జోరుకు 15ఓవర్లకే సన్ రైజర్స్ 140పరుగులు చేసింది. అయితే 16ఓవర్లో అల్జారీ జోసెఫ్ బౌలింగ్లో అభిషేక్ శర్మ ఔటయ్యాక స్కోరు వేగం నెమ్మదించింది. తర్వాత హాఫ్ సెంచరీ చేసుకున్నాక మార్క్రామ్ యష్ దయాల్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. తర్వాత పూరన్ (3), సుందర్ (3)తొందరగా ఔటయిన చివర్లో శశాంక్ సింగ్ 6బంతుల్లో 25పరుగులు నాటౌట్ చెలరేగడంతో సన్ రైజర్స్ 195పరుగుల భారీ స్కోరు చేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ ( కెప్టెన్ ), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్ ( వికెట్ కీపర్ ), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి.నటరాజన్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్ ), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ

Story first published: Wednesday, April 27, 2022, 21:39 [IST]
Other articles published on Apr 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X