న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షేన్‌ వార్న్‌ వినూత్న సలహా.. బంతిపై ఉమ్మి రాయకుండా.. !!

Shane Warne suggests using weighted balls to avoid saliva and tampering in post Coronavirus

మెల్‌బోర్న్‌: క్రికెట్ ఆటలో బౌలర్లు బంతిపై ఉమ్మి, చెమట రాయడం కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తికి దారి తీయవచ్చన్న చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మి, చెమట స్థానంలో మైనపు పూతను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఉమ్మి, చెమట ఉపయోగించకుండా బంతిని స్వింగ్‌ చేసేందుకు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ షేన్ ‌వార్న్‌ వినూత్నమైన సలహా ఇచ్చాడు. బంతికి మెరుపు అవసరం లేకుండా.. ఒకవైపు బరువు పెంచితే చాలని సూచించాడు.

ఆ వార్త‌ల‌కు దూరంగా ఉంటున్నా.. ఎక్కువ‌గా చూస్తే..: డుప్లెసిస్‌ఆ వార్త‌ల‌కు దూరంగా ఉంటున్నా.. ఎక్కువ‌గా చూస్తే..: డుప్లెసిస్‌

బంతి బరువు పెంచితే:

బంతి బరువు పెంచితే:

ఒకవైపు బంతి బరువు పెంచితే.. ఫ్లాట్‌ వికెట్లపైనా స్వింగ్‌ సులువుగా రాబట్టొచ్చని షేన్ ‌వార్న్‌ అంటున్నాడు. ఇలా చేయడం ద్వారా బాల్‌ ట్యాంపరింగ్‌ శాశ్వతంగా మాయమవుతుందని చెప్పుకొచ్చాడు. స్కై స్పోర్ట్స్ క్రికెట్ 'పోడ్‌కాస్ట్'లో వార్న్‌ మాట్లాడుతూ... 'నిరంతరం స్వింగ్ అయ్యేలా ఒకవైపు బంతి బరువు ఎందుకు పెంచకూడదు. అప్పుడది టేప్‌ వేసిన టెన్నిస్‌ బంతిలా ఉంటుంది. వాతావరణం వేడిగా ఉన్నా, వికెట్లు ఫ్లాట్‌గా ఉన్నా రెండు, మూడో రోజు తర్వాత స్వింగ్‌ అవుతుంది. బంతి బరువు పెంచితే ట్యాంపరింగ్‌ సమస్య కూడా ఉండదు. సీసా మూతలు, ఉప్పు కాగితం వంటివి అవసరం లేదు' అని అన్నాడు.

మార్పులు చేస్తే తప్పేముంది:

మార్పులు చేస్తే తప్పేముంది:

క్రికెట్లో ఇప్పటి వరకు బ్యాటు పరిమాణం, బరువుల్లో మార్పులు వచ్చాయి కానీ బంతిలో ఎలాంటి మార్పులేదని వార్న్‌ పేర్కొన్నాడు. ఇప్పుడు మార్పులు చేస్తే తప్పేముంది, బంతి బరువు పెంచితే లెక్క సరిపోతుందన్నాడు. 'బ్యాట్లు ఎలా పరిణామం చెందాయో మన అందరికీ తెలుసు. 1980లో బ్యాటు పట్టుకొని ఇప్పటి బ్యాట్లు పట్టుకుంటే ఎంత తేడా ఉంటుంది. ఇప్పటివి చాలా తేలిగ్గా ఉంటాయి. మరి బంతి మాత్రం ఎందుకు మారలేదు' అని వార్న్‌ ప్రశ్నించాడు. మొత్తానికి బంతికి ఒకవైపు బరువు పెంచితే ఎలాంటి సమస్య ఉందన్నాడు.

మైనపు పదార్థం సాయంతో:

మైనపు పదార్థం సాయంతో:

ఆస్ట్రేలియా కంపెనీ కూకాబుర్రా త్వరలోనే బంతిపై మెరుపు కోసం మైనపు పదార్థాన్ని తయారు చేయనుందట. 'జేబులో ఇమిడేలా ఉండే ఈ మైనపు పదార్థం సాయంతో అంపైర్‌ సమక్షంలోనే బంతిపై రుద్దొచ్చు. ఒక నెలలో ఇది అందుబాటులోకి రావచ్చు. ఇది ఎలా పని చేస్తుందో మ్యాచ్‌ పరిస్థితుల్లో దీన్ని పరీక్షించాల్సిన అవసరం ఉంది' అని కూకాబుర్రా ఓ ప్రకటనలో తెలిపింది. ఆస్ట్రేలియా క్రీడా సంస్థ మార్గదర్శకాల మేరకు బంతిపై ఉమ్మి, చెమట ఉపయోగించకూడదని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా నిర్ణయించిన విషయం తెలిసిందే.

బాల్ ‌టాంపరింగ్' అధికారికం చేయడమే:

బాల్ ‌టాంపరింగ్' అధికారికం చేయడమే:

బంతి నుంచి స్వింగ్‌ రాబట్టడం కోసం ఉమ్మి, చెమట ఉపయోగించడం క్రికెట్లో సర్వసాధారణం. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా దెబ్బకు ఇకపై ఇలా చేయాలంటే భయపడాల్సిందే. వైరస్ లక్షణాలున్న వ్యక్తి బంతిపై ఉమ్మితే.. మ్యాచ్‌లో పాల్గొన్న వాళ్లందరికీ కరోనా సోకే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ క్రికెట్‌ మొదలయ్యాక బౌలర్లు, ఫీల్డర్లు బంతిని ఈ తరహాలో పాలిష్‌ చేయాలంటే కష్టమే. దీనిపై నిషేధాజ్ఞలు కూడా విధించొచ్చని భావిస్తున్నారు. బంతి నుంచి స్వింగ్‌ రాబట్టడం కోసం ఉమ్మి, చెమటను వాడకుండా నిషేధాజ్ఞలు జారీ అయితే.. బంతిని స్వింగ్‌కు అనుకూలంగా మార్చడం ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు పరిష్కారం 'బాల్ ‌టాంపరింగ్'‌ను అధికారికం చేయడమే అంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.

Story first published: Tuesday, May 5, 2020, 19:47 [IST]
Other articles published on May 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X