న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్రలో అత్యంత వివాదాస్పద ‘బాడీలైన్‌’ సిరీస్‌ గురించి షేన్ వార్న్

Shane Warne Slams Steve Waugh, Expresses Admiration For Bodyline Skipper Douglas Jardine

హైదరాబాద్: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్‌కు వివాదాలు కొత్తేం కాదు. తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచాన్ని జయించిన ఈ స్పిన్నర్ అంతే దురుసుతనంతో వార్తల్లో నిలిచిన సందర్భాలు ఎన్నో. ఇటీవలే తన సహచర క్రికెటర్, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్‌వాను స్వార్థపరుడన్న షేన్ వార్న్ మరోసారి తనదైన శైలిలో విమర్శించాడు.

అత్యాచార ఆరోపణలు: రొనాల్డోకు తొలి ఎదురుదెబ్బ, సస్పెండ్‌ చేసిన కోచ్అత్యాచార ఆరోపణలు: రొనాల్డోకు తొలి ఎదురుదెబ్బ, సస్పెండ్‌ చేసిన కోచ్

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య 1932-33లో జరిగిన ఆ యాషెస్‌ సిరీస్‌ అంటే తన కెంతో ఇష్టమని తన పుస్తకం 'నో స్పిన్‌'లో పేర్కొన్న షేన్‌ వార్న్ అదే సమయంలో స్టీవ్‌వాను మళ్లీ ఆడిపోసుకున్నాడు. తన క్రికెట్ ప్రస్థానంపై తాజాగా విడుదలైన నో స్పిన్ అనే పుస్తకంలో వార్న్ పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావించాడు.

 ‘బాడీలైన్‌’ సిరీస్‌ గురించి వార్న్ పుస్తకంలో

‘బాడీలైన్‌’ సిరీస్‌ గురించి వార్న్ పుస్తకంలో

ఇందులో ఒకటి ‘బాడీలైన్‌' సిరీస్‌. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వివాదాస్పద సిరీస్‌ ఇది. ఈ సిరిస్‌పై వార్న్ తన పుస్తకంలో "క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్లలో డగ్లస్ ఒకడు. బ్రాడ్‌మన్‌ పరుగుల ప్రవాహన్ని అడ్డుకోవడానికి సాహాసోపేత నిర్ణయం తీసుకున్నాడు. అదే బాడీలైన్‌. అది క్రికెట్‌ తీరుతెన్నులను మార్చివేసింది" అని వార్న్‌ ప్రశంసించాడు.

 ఇంగ్లాండ్ పేస్ దళానికి పూర్తి స్వేచ్చ

ఇంగ్లాండ్ పేస్ దళానికి పూర్తి స్వేచ్చ

ఆ యాషెస్‌ సిరీస్‌లో.. హార్లోడ్ లార్‌వుడ్ సారథ్యంలోని ఇంగ్లాండ్ పేస్ దళానికి పూర్తి స్వేచ్చను ఇస్తూ ఆసీస్ బ్యాట్స్‌మెన్‌పై బాడీలైన్ బౌలింగ్‌తో దాడికి దిగాడు అని వార్న్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు. బ్రాడ్‌మన్‌ పరుగులు చేయకుండా నిలువరించే ధ్యేయంతో ఇంగ్లాండ్‌ కెప్టెన్ జార్డిన్‌ ‘బాడీలైన్‌' బౌలింగ్‌ను అనుసరించాడు.

బ్యాట్స్‌మన్‌ శరీరంపైకి వేగంగా బంతులు వేస్తే

బ్యాట్స్‌మన్‌ శరీరంపైకి వేగంగా బంతులు వేస్తే

ఇందులో భాగంగా బ్యాట్స్‌మన్‌ శరీరంపైకి వేగంగా బంతులు వేస్తే.. వాటిని ఆడే క్రమంలో బ్యాట్‌ను అడ్డుపెట్టక తప్పదని, దాంతో బంతి బ్యాట్‌ను రాసుకుంటూ వెళ్లి ఆటగాడి చుట్టూ మోహరించిన ఫీల్డర్లకు క్యాచ్‌గా వెళుతుందన్నది జార్డిన్‌ ఆలోచన. ఆ వ్యూహం వ్యుహాం కారణంగా ఇంగ్లండ్ 4-1తో ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్‌లో ఘనవిజయం సాధించింది.

 విలన్‌గా మారిపోయిన డగ్లస్

విలన్‌గా మారిపోయిన డగ్లస్

దీంతో ఆస్ట్రేలియా వ్యాప్తంగా డగ్లస్ ఒక విలన్‌గా మారిపోయాడు. కానీ ఇంగ్లాండ్‌ తీరుపై ఆసీస్‌ ఫ్యాన్స్‌ మండిపడ్డారు. ఆ సిరీస్‌ ఫలితంగా ఆ తర్వాత ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా దేశాల మధ్య సంబంధాలూ దెబ్బతిన్నాయి. అలాంటి డగ్లస్‌ను షేన్ వార్న్ కీర్తిస్తూ తన పుస్తకంలో ప్రస్తావించడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది.

నన్ను అర్ధంతరంగా జట్టు నుంచి తప్పించాడు

నన్ను అర్ధంతరంగా జట్టు నుంచి తప్పించాడు

మరోవైపు స్టీవా వా గురించి "1999లో వెస్టిండీస్‌తో నాలుగో టెస్ట్ నుంచి నన్ను అర్ధంతరంగా జట్టు నుంచి స్టీవ్ వా తప్పించాడు. దీంతో అప్పటివరకు అతనిపై ఉన్న గౌరవాన్ని పూర్తిగా తగ్గించుకున్నాను. జట్టుకు దూరమైన నాకు అండగా నిలుస్తాడని అనుకున్నా.. అది ఎప్పుడూ జరుగలేదు. జట్టు గెలుపు, ఓటములు పట్టించుకోకుండా వ్యక్తిగత రికార్డులపైనే స్టీవ్‌వా దృష్టిపెట్టేవాడు" అని వార్న్ అన్నాడు.

Story first published: Saturday, October 6, 2018, 12:31 [IST]
Other articles published on Oct 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X