న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాధపడ్డాం.. కోపంగా కూడా ఉన్నాం: బాల్ టాంపరింగ్ వివాదంపై వార్న్

By Nageshwara Rao
Shane Warne questions severity of punishments in Australia ball-tampering scandal

హైదరాబాద్: బాల్ టాంపరింగ్‌కు పాల్పడి దేశం పరువు తీసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. స్మిత్, వార్నర్‌కు ఏడాది నిషేధం విధించగా, బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది.

క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాది జరుగనున్న ఐపీఎల్‌లోనూ స్మిత్‌, వార్నర్‌ పాల్గొనడం లేదని బీసీసీఐ కూడా స్పష్టం చేసింది. క్రీడాస్ఫూర్తిని ఉల్లంఘించిన వీరిపై క్రికెట్‌ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ ఉదంతంపై ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ ఫేస్‌బుక్‌ వేదికగా తన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

బాల్ టాంపరింగ్: ట్రేడ్‌ మీలో అమ్మకానికి 'ఆస్ట్రేలియన్‌ స్పోర్ట్స్‌ టేప్‌'బాల్ టాంపరింగ్: ట్రేడ్‌ మీలో అమ్మకానికి 'ఆస్ట్రేలియన్‌ స్పోర్ట్స్‌ టేప్‌'

తన సుదీర్ఘ కెరీర్‌లో ఇలాంటి సిగ్గుమాలిన సంఘటన ఎప్పుడూ చూడలేదని, క్షమించలేని తప్పును ఆసీస్‌ ఆటగాళ్లు చేసారని వార్న్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఈ సమయంలో వాళ్లు చేసిన తప్పుకు సంవత్సర నిషేధం సరిపోతుందని నేను అనుకోవడం లేదు. వాళ్లు క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించారు. ఆస్ట్రేలియన్లకు క్రీడాస్ఫూర్తి ఉండాలి. అప్పట్లో మేము తప్పులు చేశాం. కానీ ఇలాంటి వాటికి మాత్రం దూరంగా ఉన్నాం' అని అన్నాడు.

'ఆటలో గెలవాలనే ఒకే ఒక ఆలోచనే ఆటగాళ్లను ఎలాంటి తప్పులైనా చేసేందుకు ప్రోత్సహిస్తుంది. కానీ స్టీవ్‌ స్మిత్‌ మాత్రం క్షమించరాని నేరం చేశాడు. దానికి అతను అనుభవించాల్సిందే. స్మిత్ కెరీర్‌ చూసినట్లయితే ఒక కెప్టెన్‌గా, ఆటగాడిగా ఎంతో కష్టపడ్డాడు. ఆస్ట్రేలియా జట్టుకు అతను ఎన్నో అద్భుత విజయా అందించాడు. కానీ ప్రస్తుతం మాత్రం మూర్ఖత్వపు ఆలోచనకు పాల్పడ్డాడు' అని వార్న్ మండిపడ్డాడు.

'ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిందంటే అది వినడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంది. మేముంతా ఈ విషయంలో ఎంతో బాధపడ్డాం. కోపంగా కూడా ఉన్నాం. మీరు చేసిన తప్పుకు ఏవిధంగా స్పందించాలో అర్థం కావటం లేదు. ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నామంటే కచ్చితంగా గెలిచే విధంగా ఆడాలి. అలా అని మోసం చేసి గెలిచే ప్రయత్నం చేయకూడదు' అని పేర్కొన్నాడు.

'గతంలో బాల్‌ టాంపరింగ్‌ను చాలా మంది ఆటగాళ్లు ఆవేశపూరితంగా చేశారని, కానీ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒక వస్తువు తెచ్చుకొని టాంపరింగ్ చేయడం తానెప్పుడు చూడలేదు. ఇది ఓ సిగ్గుమాలిన చర్య. ఈ చర్యతో దేశ పరువు తీయడమే కాకుండా ఆసీస్‌ అభిమానులకు అపత్రిష్ట తెచ్చారు' అని వార్న్ఆవేదన వ్యక్తం చేశాడు.

బాల్ టాంపరింగ్‌లో మోసగాళ్లు ముగ్గురే: కోచ్‌ లీమన్‌ పాత్ర లేదు, నేడు శిక్ష ఖరారుబాల్ టాంపరింగ్‌లో మోసగాళ్లు ముగ్గురే: కోచ్‌ లీమన్‌ పాత్ర లేదు, నేడు శిక్ష ఖరారు

'కష్టపడి ఆడినా ప్రతీ మ్యాచ్‌ను గెలవలేమని, ఓటమి ఆటలో ఒక భాగమే అనే విషయాన్ని ఆటగాళ్లు గుర్తించాలి. అసలు కేప్‌టౌన్‌లో ఏం చేశారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి' అని ఆటగాళ్లకు వార్న్‌ హితబోద చేశారు.

'ఈ బాల్ టాంపరింగ్ వివాదం ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. దీంతో ప్రతి ఒక్కరూ ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టును ఇష్టపడటం లేదు. ఇంతకుముందు ఆటగాళ్లు కూడా ఇదేవిధంగా చేశారని ప్రతి ఒక్కరూ భావిస్తారు. వారు ఊహలకు మీరు అవకాశం ఇచ్చినట్లయింది. మనం మన క్రీడాకారులకు ఎంతో గౌరవం ఇస్తాం. దానిమూలంగానే మీరు చేసిన ఈ పని తీవ్రంగా వేధిస్తుంది' అని వార్న్ అన్నాడు.

'స్మిత్‌, వార్నర్‌ల నిషేధంతో నవంబర్‌లో భారత్‌తో జరిగే కీలక సిరీస్‌కు దూరం కావడం ఇబ్బంది కలిగించే విషయం అని, కానీ వరల్డ్‌ కప్‌కు అందుబాటులో ఉండటం సంతోషం' అని వార్న్‌ పేర్కొన్నాడు. ఏడాది నిషేధం తర్వాత వచ్చే ఆటగాళ్లను స్వాగతించాలని అభిమానులకు వార్న్‌ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు.

Story first published: Thursday, March 29, 2018, 7:29 [IST]
Other articles published on Mar 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X