న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్ఘాన్‌తో టెస్టుకు షమీని తప్పించిన యోయో..!

Shami fails Yo-Yo test, Navdeep Saini gets maiden Test call-up

హైదరాబాద్: ఇటీవల కాలంలో వివాదాలతో సతమతమవుతోన్న భారత పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ యో యో ఫిట్‌నెస్‌ పరీక్షలో ఫెయిలయ్యాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో నిర్వహించిన యో-యో ఫిట్‌నెస్ పరీక్షలో షమీ ఫెయిలయ్యాడు. దీంతో టెస్ట్ జట్టు నుంచి షమీని తప్పిస్తూ ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ ఢిల్లీ యువ బౌలర్ నవ్‌దీప్‌సైనీ అవకాశం కల్పించింది.

ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే భారత ‘ఎ’ జట్టులోనూ:

ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే భారత ‘ఎ’ జట్టులోనూ:

సైనీ.. భారత టెస్టు జట్టులోకి ఎంపిక కావడం ఇదే తొలిసారి. జాతీయ జట్టులోకి ఎంపిక చేశారు. 25 ఏళ్ల సైని ఇప్పటివరకు 31 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు తీశాడు. గత రెండు రంజీ సీజన్లలో సైని చక్కటి ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం దేశంలో అత్యంత వేగవంతమైన బౌలర్లలో అతనొకడు. వచ్చే నెలలో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే భారత ‘ఎ' జట్టులోనూ సైనీ సభ్యుడిగా ఉన్నాడు.

గంభీర్ సాయంతోనే ఇలా:

గంభీర్ సాయంతోనే ఇలా:

భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన నవ్‌దీప్‌సైనీ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. 2013 వరకు టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడిన సైనీ తన కెరీర్ ఇంతలా మలుపు తిరగడానికి కారణం ఢిల్లీ కెప్టెన్ గంభీర్ అని చెప్పాడు. నా ప్రతిభను గుర్తించి, సెలెక్టర్లను ఒప్పించి ఢిల్లీ జట్టు తరఫున ఆడేందుకు గంభీర్ అవకాశమిచ్చాడు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లోనూ సత్తాచాటాను. ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా టెన్నిస్ బంతితో వేసినట్లే వేయమంటూ గౌతీ ప్రోత్సహించడం కెరీర్ ఎదుగుదలకు కారణమైంది అని సైనీ చెప్పుకొచ్చాడు.

యోయో పరీక్షలో విఫలం కావడంతో కెరీర్‌పై సందేహాలు:

యోయో పరీక్షలో విఫలం కావడంతో కెరీర్‌పై సందేహాలు:

28 ఏళ్ల షమి కొన్నేళ్ల ముందు నుంచే ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడుతున్నాడు. అతను యోయో పరీక్షలో విఫలం కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ 23 ఏళ్ల కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాట్సమన్‌ సంజు శాంసన్‌ కూడా ఈ పరీక్ష నెగ్గలేకపోవడమే చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు యోయో పరీక్షలో విఫలం కావడం అతడి కెరీర్‌పై సందేహాలు రేకెత్తిస్తోంది.

భారమంతా ఇషాంత్‌, ఉమేశ్‌, పాండ్యాలపై:

భారమంతా ఇషాంత్‌, ఉమేశ్‌, పాండ్యాలపై:

షమి లేకపోవడంతో బౌలింగ్‌ భారం ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యాలపై పడనుంది. ఇప్పటికే ఈ టెస్టు నుంచి రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లీ తప్పుకోగా.. గాయం కారణంగా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా కూడా దూరమయ్యాడు.

Story first published: Tuesday, June 12, 2018, 8:54 [IST]
Other articles published on Jun 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X