న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పుల్వామా ఉగ్రదాడి: అమర జవాన్ల కుటుంబాలకు షమీ సాయం

Mohammed Shami Donates Money To Families Of Soldiers | Oneindia Telugu
Shami donates money to the families of martyred CRPF soldiers

హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి తన ఆర్థిక సాయం ప్రకటించారు. ఇప్పటికే ఎంతో మంది అమర జవాన్ల కుటుంబ సభ్యులకు తమవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. గత గురువారం జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.

పుల్వామా ఉగ్రదాడి ఎఫెక్ట్: పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లు నిలిపివేతపుల్వామా ఉగ్రదాడి ఎఫెక్ట్: పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లు నిలిపివేత

షమీ మాట్లాడుతూ

షమీ మాట్లాడుతూ

ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ "భద్రతా దళాలు దేశం కోసం సరిహద్దుల్లో నిలబడతారు. మేము దేశం కోసం ఆడితే వాళ్లు మన కోసం దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తారు. ఇలాంటి సందర్భంలో మన జవాన్ల కుటుంబాలకు మనమంతా అండగా ఉందాం. వారి కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉందాం" అని షమీ పేర్కొన్నాడు.

శిఖర్‌ ధావన్‌ సైతం

శిఖర్‌ ధావన్‌ సైతం

అంతకముందు టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తన ట్విట్టర్‌లో సైనిక కుటుంబాలకు అండగా ఉంటానని ట్వీట్ చేశారు. తానూ ఆర్థికసాయం చేస్తానని చెప్పిన శిఖర్ ధావన్ ఓ భావోద్వేగ వీడియో పోస్టు చేస్తూ అమర జవాన్ల కుటుంబానికి అభిమానులను కూడా సాయం అందించాలని కోరాడు.

ఇమ్రాన్ ఖాన్ ఫోటోలు తొలగింపు

ఇమ్రాన్ ఖాన్ ఫోటోలు తొలగింపు

వీరితో పాటు మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతం గంభీర్‌ కూడా అమర జవాన్ల పిల్లలకు తమవంతుగా విద్యను అందించడానికి ముందుకు వచ్చారు. పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తొలగించిన సంగతి తెలిసిందే.

పీసీఏ వినూత్న నిరసన

పీసీఏ వినూత్న నిరసన

ఇదిలా ఉంటే, పుల్వామా ఉగ్రదాడిపై పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (పీసీఏ) వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. మొహాలి క్రికెట్‌ స్టేడియంలో ఉన్న 15 మంది పాకిస్తాన్‌ క్రికెటర్ల ఫొటోలను పీసీఏ తొలగించింది. స్టేడియంలో లోపలి భాగంలో గ్యాలరీలో, రిసెప్షన్‌ వద్ద, 'హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌'లో ఈ చిత్రాలు ఉన్నాయి.

Story first published: Tuesday, February 19, 2019, 15:48 [IST]
Other articles published on Feb 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X