న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచ రికార్డు: అప్పుడు నా వయసు 16 కాదు 19: ‘గేమ్‌ చేంజర్‌’లో అఫ్రిది

Shahid Afridi Says 'I Was Not Aware Of My Age When I Appeared In U-14 Trials' || Oneindia Telugu
Shahid Afridi was not aware of his age when he appeared in U-14 trials

హైదరాబాద్: అండర్‌-14 ట్రయల్స్‌కు వెళ్లినపుడు తన అసలు వయసెంతో తనకు తెలియదని.... సెలక్టర్లు అడగ్గానే నోటికొచ్చిన వయసు చెప్పేశానని... ఇలా చెప్పడం వల్లే తన వయసు విషంలో గందరగోళం నెలకొందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిది అఫ్రిది వెల్లడించాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

1996-97లో నైరోబి వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది 37 బంతుల్లోనే సెంచరీ కొట్టి ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. అప్పుడు అఫ్రిది వయసు అధికారిక లెక్కల ప్రకారం 16 ఏళ్లు. అయితే, అందరూ అనుకున్నట్లు తన వయసు 16 కాదని, 19 అని తన ఆత్మకథ 'గేమ్‌ చేంజర్‌'లో అఫ్రిది పేర్కొన్న సంగతి తెలిసిందే.

స్పష్టత ఇచ్చిన అఫ్రిది

స్పష్టత ఇచ్చిన అఫ్రిది

తాజాగా తన వయసు విషయంపై అఫ్రిది స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా ఓ పాకిస్థాన్ టివి ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అఫ్రిది మాట్లాడుతూ "అండర్‌-14 ట్రయల్స్‌కు వెళ్లినపుడు నా అసలు వయసెంతో నాకే తెలియదు. సెలక్టర్లు అడగ్గానే నోటికొచ్చిన వయసు చెప్పేశా. అదే మా క్రికెట్‌ బోర్డు రికార్డుల్లో నమోదైంది" అని అన్నాడు.

1996లో సెంచరీ కొట్టినపుడు

1996లో సెంచరీ కొట్టినపుడు

"నేను 1996లో సెంచరీ కొట్టినపుడు నా వయసు గురించి చర్చ జరిగింది. అయితే అప్పుడు అలా చెప్పడంపై నాకు ఎలాంటి చింతా లేదు. ఎందుకంటే వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేశాను కాబట్టి" అని అఫ్రిది పేర్కొన్నాడు. కాగా, తాను 1975లో పుట్టినట్లు తన సర్టిఫికెట్‌లో వచ్చిందని, కానీ తాను పుట్టింది 1977లో అని చెప్పిన సంగతి తెలిసిందే.

పొరబాటును సరిదిద్దికుంటా

పొరబాటును సరిదిద్దికుంటా

అయితే, ఈ పుస్తకం తర్వాతి ప్రచురణలో ఈ పొరబాటును సరిదిద్దికుంటానని తెలిపాడు. "పబ్లిషర్స్, కాపీ ఎడిటర్స్ చేసిన తప్పు అది. ఈ పుస్తకం రెండో ఎడిషన్‌లో ఆ తప్పును తప్పకుండా సరిద్దుకుంటాను" అని అఫ్రిది తెలిపాడు. దీంతో పాటు తొలి ఎడిషన్‌లో దొర్లిన చిన్నపాటి తప్పులను రెండో ఎడిషన్‌లో సరిదిద్దుకుంటామని చెప్పాడు.

అఫ్రిదికి అక్తర్ బాసట

అఫ్రిదికి అక్తర్ బాసట

తన పుస్తకంలో సీనియర్లపై విమర్శలు గుప్పించిన అఫ్రిదికి ఆ జట్టు మాజీ పేసర్ అక్తర్‌ అండగా నిలిచాడు. "నిజానికి అఫ్రిది చెప్పింది తక్కువ. అప్పట్లో సీనియర్లు మాతో చాలా దురుసుగా వ్యవహరించారు. ఆస్ట్రేలియా పర్యటనలో నలుగురు సీనియర్లు నన్ను బ్యాటుతో కొట్టడానికి సిద్దమయ్యారు. అయితే, ఆ తర్వాత పది మంది సీనియర్లు వారి ప్రవర్తనకు చింతిస్తూ క్షమాపణ చెప్పారు" అని అక్తర్ చెప్పాడు.

Story first published: Friday, May 10, 2019, 11:12 [IST]
Other articles published on May 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X