అది ఆటగాళ్ల హక్కు: ఫేర్‌వేల్‌పై ఆఫ్రిది ఘాటు వ్యాఖ్య

Posted By:

హైదరాబాద్: ఇటీవలే పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అఫ్రిదికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫేర్‌వెల్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆఫ్రిదిని పాకిస్తాన్ ఎగ్జిక్యూటిర్ కమిటీ చైర్మన్ నజీమ్ సేథీ కలిసి ఫేర్‌వెల్ చర్చించారు.

Shahid Afridi turns down Najam Sethi's farewell offer

అయితే బోర్డు ఇస్తామన్న ఫేర్‌వెల్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు అఫ్రిది పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను వేరు పనులతో చాలా బిజీగా ఉన్నానని, ఫేర్‌వెల్ పార్టీ తనకొద్దంటూ ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. దీనిలో భాగంగా ఫేర్ వెల్ పార్టీ ఆఫర్ ఇవ్వడానికి ఎట్టకేలకు దిగివచ్చిన పీసీబీకి ధన్యవాదాలు ఆఫ్రిది తెలియజేశాడు.

పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్లు మిస్బా ఉల్ హక్‌తో పాటు యూనిస్ ఖాన్‌లకు ఫేర్‌వెల్ పార్టీలు ఇచ్చే క్రమంలో ఆఫ్రిదిని కూడా బోర్డు సంప్రదించింది. నిజానికి ఫేర్‌వేల్ కార్యక్రమాలు అనేవి ఆటగాళ్ల హక్కుగా ఆఫ్రిది అభివర్ణించాడు. ఇదే సంప్రాదాయాన్ని భవిష్యత్తులో సైతం కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు ఆఫ్రిది పేర్కొన్నాడు.

అఫ్రిది రిటైర్మెంట్‌కు ముందు ఓ ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహిస్తే క్రికెట్ నుంచి ఘనంగా వీడ్కోలు చెబుతానని ఎన్నిసార్లు ఆ దేశ క్రికెట్ బోర్డుకు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. తొలుత ఫేర్‌వెల్ మ్యాచ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన పీసీబీ.. ఆ తరువాత దానిని ఉపసంహరించుకుంది.

ఆ తర్వాత అఫ్రిదిని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి కూడా బోర్డు తొలగించడంతో బాధాకారంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 1996లో కెన్యాపై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. పాకిస్థాన్ తరుపున 27 టెస్టులు, 398 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 1,176 పరుగులతో పాటు, 48 వికెట్లు సాధించాడు.

ఇక వన్డేల్లో 398 మ్యాచ్‌ల్లో 8,064 పరుగులు, 395 వికెట్లు సాధించాడు. వన్డేల్లో 351 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. ఇక టీ20 పార్మాట్‌లో 98 మ్యాచ్‌లు ఆడి 1,405 పరుగులు, 97 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

Story first published: Friday, April 28, 2017, 22:25 [IST]
Other articles published on Apr 28, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి