న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆల్‌టైమ్‌ జట్టులో కోహ్లీని తీసుకోవడానికి కారణం ఇదే: అఫ్రిది

Shahid Afridi Reveals Why He Picked Virat Kohli In World Cup XI || Oneindia Telugu
Shahid Afridi reveals why he picked Virat Kohli and not MS Dhoni, Sachin Tendulkar in World Cup XI

తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్‌ షాహిదీ ఆఫ్రిది తన ఆల్‌టైమ్‌ వరల్డ్‌కప్‌ జట్టును ప్రకటించాడు. ఈ ఆల్‌టైమ్‌ జట్టులో భారత్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీని మాత్రమే ఎంపిక చేసుకున్నాడు. దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత జట్టుకు వరల్డ్‌కప్‌ అందించిన ఎంఎస్ ధోనీలకు ఆఫ్రిది చోటు కల్పించలేదు. దీంతో భారత్‌తో పాటు ఇతర దేశాల క్రికెట్‌ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఈ నేపథ్యంలో ఆల్‌టైమ్‌ జట్టులో కోహ్లీని మాత్రమే తీసుకోవడానికి అసలు కారణంను అఫ్రిది వెల్లడించాడు. 'సచిన్‌, ధోనీలు బెస్ట్ క్రికెటర్లు. ఇద్దరూ భారత క్రికెట్‌కు ఎంతో కీర్తిని తెచ్చారు. వాళ్లను కించపరచడం నా ఉద్దేశం కాదు. కోహ్లీని ఎంచుకోవడానికి కారణం అతని బ్యాటింగే. కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తుంటే చూడడానికి బాగుంటుంది' అని అఫ్రిది తెలిపారు.

'భారత ప్రతి పర్యటనను ఆస్వాదించాను. నాతో పాటు ఇతర పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా ఎంజాయ్ చేశారు. క్రికెట్‌కు భారత్ లో మంచి ఆదరణ ఉంది. వచ్చిన డబ్బును మరలా గేమ్, ఆటగాళ్లకు పెట్టుబడిగా పెడుతున్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య విద్వేషాలను తగ్గించేందుకు క్రికెట్‌ మంచి మార్గం' అని అఫ్రిది పేర్కొన్నాడు.

అఫ్రిది 'ఆల్‌టైమ్‌ వరల్డ్‌కప్‌ లెవన్‌' జట్టు:
సయీద్‌ అన్వర్‌, గిల్‌ క్రిస్ట్‌, రికీ పాంటింగ్‌, విరాట్‌ కోహ్లీ, ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, జాక్వస్‌ కలిస్‌, వసీం అక్రమ్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, షేన్‌ వార్న్‌, షోయబ్‌ అక్తర్‌, సక్లయిన్‌ ముస్తాక్‌.

Story first published: Friday, May 10, 2019, 17:38 [IST]
Other articles published on May 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X