న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

See pic: విండిస్ క్రికెట్ లెజెండ్‌తో మహేష్ బాబు ఫ్యాన్‌బాయ్ మూమెంట్

Mahesh Babu's Fanboy Moment With Cricket Legend Andy Roberts || Oneindia Telugu
See pic: Mahesh Babus fanboy moment with cricket legend Andy Roberts

హైదరాబాద్: వెస్టిండిస్ క్రికెట్ లెజెండ్ ఆండీ రాబర్డ్స్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ 'ఫ్యాన్ బాయ్ మూమెంట్' అంటూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'మహర్షి' మూవీ గ్రాండ్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు కుటుంబంతో కలిసి యూరఫ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో మహేష్ బాబు మరింత ఖుషీగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు కూడా కుటుంబంతో కలిసి హాజరయ్యారు. తాజాగా వెస్టిండిస్ క్రికెట్ లెజెండ్ ఆండీ రాబర్ట్స్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఇది నాకు గొప్ప అనుభూతి

ఈ సందర్భంగా "ఇది నాకు గొప్ప అనుభూతి అని, నేను ఆయనకు పెద్ద అభిమాని, హ్యూజ్ ఫ్యాన్ బాయ్ మూమెంట్" అంటూ ట్వీట్ చేశారు. ఆండీ రాబర్ట్స్ ఎవరో కాదు ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఏలిన దిగ్గజ బౌలర్లలో ఒకడు. వెస్టిండిస్ తరుపున టెస్టుల్లో రెండు సార్లు ఏడు వికెట్లను పడగొట్టాడు.

వెస్టిండిస్ జట్టుకు ప్రాతినిథ్యం

వెస్టిండిస్ జట్టుకు ప్రాతినిథ్యం

వెస్టిండిస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మొట్టమొదటి ఆంటిగ్వా ప్లేయర్. 2005లో యునైటెడ్ స్టేట్స్ క్రికెట్ హాఫ్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న రెండో ఆంటిగ్వా ఆటగాడు కూడా. ఇక, కౌంటీ క్రికెట్ విషయానికి వస్తే హాంప్‌షైర్, లీసెస్టర్ కంట్రీ క్రికెట్ క్లబ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు.

47 టెస్టు మ్యాచ్‌లాడి 202 వికెట్లు

47 టెస్టు మ్యాచ్‌లాడి 202 వికెట్లు

వెస్టిండిస్ తరుపున మొత్తం 47 టెస్టు మ్యాచ్‌లాడి 202 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 5 వికెట్లను 11 సార్లు తీశాడు. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లను రెండు సార్లు తీశాడు. టెస్టుల్లో ఆండీ రాబర్డ్స్‌ అత్యధిక స్కోరు 61. ఇక, వన్డే విషయానికి వస్తే విండిస్ తరుపున 56 వన్డేలాడి 231 పరుగులు చేశాడు.

మహేష్ తదుపరి చిత్రం సరిలేరు నీకెవ్వరు

మహేష్ తదుపరి చిత్రం సరిలేరు నీకెవ్వరు

వన్డేల్లో అత్యధిక స్కోరు 37 నాటౌట్. వన్డేల్లో 87 వికెట్లు తీశాడు. యూరప్ ట్రిప్ ముగించుకుని ఇండియా వచ్చిన వెంటనే మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' షూటింగులో జాయిన్ కాబోతున్నారు. మహేష్ కెరీర్లో 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Story first published: Thursday, June 13, 2019, 19:42 [IST]
Other articles published on Jun 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X