న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స‌చిన్‌లా కోహ్లీకి ఆ బ‌ల‌హీన‌త లేదు.. టెండూల్కర్‌ను అన్ని ఫార్మాట్‌లలో అధిగమిస్తాడు: పాక్ దిగ్గజం

Sarfraz Nawaz says Virat Kohli Will Surpass Sachin Tendulkar on All Fronts

కరాచీ: క్రికెట్ దిగ్గజం స‌చిన్‌ టెండూల్కర్‌కు ఉన్న ఇన్‌స్వింగ్ బంతులను ఎదుర్కొనే బల‌హీన‌త టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి లేదు అని పాకిస్థాన్ దిగ్గజ పేస‌ర్ స‌ర్ఫ‌రాజ్ నవాజ్ అన్నాడు. టెండూల్కర్‌ను విరాట్ అన్ని ఫార్మాట్‌లలో అధిగమిస్తాడని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇప్ప‌టికే స‌చిన్ రికార్డుల‌ను కొన్ని బ‌ద్ద‌లు కొట్టిన కోహ్లీ.. రాబోయే రోజుల్లో అన్ని రికార్డుల‌ను అధిగ‌మిస్తాడ‌న్నాడు. స‌చిన్‌కు ఇన్‌స్వింగ్ బంతులను ఎదుర్కొనే బల‌హీన‌త ఉండేద‌ని, కోహ్లీ బ్యాటింగ్ మాత్రం ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంద‌న్నాడు.

ఆగస్టులో టీ20ల సిరీస్.. దక్షిణాఫ్రికాకు భారత్?!!ఆగస్టులో టీ20ల సిరీస్.. దక్షిణాఫ్రికాకు భారత్?!!

స‌చిన్‌లా కోహ్లీకి ఆ బ‌ల‌హీన‌త లేదు:

స‌చిన్‌లా కోహ్లీకి ఆ బ‌ల‌హీన‌త లేదు:

దిగ్గజ ఫాస్ట్ బౌలర్ స‌ర్ఫ‌రాజ్ నవాజ్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ... 'పోలికలో విరాట్ కోహ్లీ నిస్సందేహంగా ముందున్నాడు. అతను ఖచ్చితంగా అన్ని ఫార్మాట్‌లలో టెండూల్కర్‌ను అధిగమిస్తాడు. టెండూల్కర్‌కు ఇన్‌స్వింగ్ బంతులను ఎదుర్కొనే బల‌హీన‌త ఉండేది. కోహ్లీకి బ్యాటింగ్‌లో ఎటువంటి లోపాలు లేవు. టెస్టు క్రికెట్‌లో గ‌తంలో ఔట్ స్వింగ‌ర్‌ల‌కు కోహ్లీ ఎక్కువ‌గా ఔట‌య్యేవాడు. అయితే క‌ఠోర సాధన‌తో దాన్ని అధిగ‌మించాడు. ప్ర‌స్తుతం కోహ్లీ కంప్లీట్ బ్యాట్స్‌మ‌న్‌లాగా క‌న్పిస్తున్నాడు' అని అన్నాడు.

ఆజమ్‌కు కెప్టెన్సీ బాధ్యత అనవసరం:

ఆజమ్‌కు కెప్టెన్సీ బాధ్యత అనవసరం:

పాకిస్తాన్ యువ బ్యాట్స్‌మన్‌ బాబర్ ఆజమ్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్‌గా నియమించడంపై స‌ర్ఫ‌రాజ్ నవాజ్ ఆందోళన వ్యక్తం చేశాడు. కెప్టెన్సీ బాధ్యతను ఆజమ్‌కు అప్పగించడం చాలా తొందరపాటు అని పేర్కొన్నాడు. 'బాబర్ ఆజమ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి పీసీబీ చాలా తొందరపడిందని నేను భావిస్తున్నా. జట్టు పగ్గాలు అందుకునే ముందు అతడు బ్యాట్స్‌మన్‌గా, వైస్‌ కెప్టెన్‌గా నిరూపించుకోవాలి.. కనీసం ముందుగా ఆ బాధ్యతలు అప్పగిస్తే బాగుండు. అనుభవజ్ఞుడు, పరిణతి చెందినప్పుడు మాత్రమే జట్టు సభ్యులు కెప్టెన్‌ను గౌరవిస్తారు' అని నవాజ్ చెప్పుకొచ్చాడు.

బుమ్రా కాలం ఆడతాడు:

బుమ్రా కాలం ఆడతాడు:

స‌ర్ఫ‌రాజ్ నవాజ్ భారత పేస్ బౌలింగ్ విభాగంపై కూడా ప్రశంసలు కురిపించాడు. భారత పేస్ బౌలింగ్ ప్రస్తుతం అద్భుతంగా ఉందన్నాడు. యువకులు, సీనియర్లతో పటిష్టంగా ఉందని పేర్కొన్నాడు. 'భారత పేస్ బౌలింగ్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా బాగా బంతులేస్తున్నాడు. అతడు అసాధారణ బౌలింగ్ శైలి కలిగి ఉన్నాడు. యార్కర్లను బాగా వేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాట్స్‌మన్‌లు అతని బంతులను అర్ధం చేసుకున్నప్పటికీ.. బాగా వేస్తున్నాడు. అతడి బంతి ఆఫ్ స్టంప్‌ వైపు వేగంగా దూసుకెళుతుంది. బుమ్రా టీమిండియా తరఫున కాలం ఆడతాడు' అని నవాజ్ అన్నాడు.

సచిన్‌తో కోహ్లీని పోల్చడాన్ని వ్యతిరేకిస్తా:

సచిన్‌తో కోహ్లీని పోల్చడాన్ని వ్యతిరేకిస్తా:

వన్డే క్రికెట్‌లో విరాట్‌కోహ్లీతో పోల్చితే‌ సచిన్‌ టెండూల్కర్‌ గొప్ప ఆటగాడని మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. కోహ్లీ నైపుణ్యం కలిగిన ఆటగాడన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు కానీ సచిన్‌తో పోల్చడాన్ని వ్యతిరేకిస్తానన్నాడు. సచిన్‌ ఆడే సమయంలో నియమాలు చాలా కఠినంగా ఉండేవని.. ప్రస్తుత అధునాతన క్రికెట్‌ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉందని గౌతీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత క్రికెట్‌లో బౌలర్లు రివర్స్‌ స్వింగ్‌, ఫింగర్‌ స్విన్‌ వేయలేకపోతున్నారని.. అయిదుగురు ఫీల్డర్లు సర్కిల్‌లో ఉండడం బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలంగా ఉందన్నాడు.

Story first published: Thursday, May 21, 2020, 18:58 [IST]
Other articles published on May 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X