న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Pakistan: భారత్‌లా పాక్ రాజకీయాల్ని కలపదు: సర్ఫరాజ్

ICC Cricket World Cup 2019 : Sarfraz Feels That Cricket And Politics Should Not Be Mixed | Oneindia
Sarfraz Ahmed opens up on India vs Pakistan World Cup match, says Pakistan never mix sports and politics

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరగాల్సిందేనని పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అభిప్రాయపడ్డాడు. క్రీడలను ఎప్పుడూ రాజకీయాలతో ముడిపెట్టవద్దని, ఈ మ్యాచ్‌ కోసం ఇరు దేశాలకు చెందిన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చాడు. మే30 నుంచి వరల్డ్‌కప్ ఆరంభం కానుండగా.. షెడ్యూల్ ప్రకారం జూన్ 16న మాంచెస్టర్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో సంబంధాలు తెంచుకోవాలి: ఐసీసీకి బీసీసీఐ లేఖఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో సంబంధాలు తెంచుకోవాలి: ఐసీసీకి బీసీసీఐ లేఖ

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో

అయితే పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌ను భారత్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. దీంతో మ్యాచ్‌ ఆడటంపై ఇప్పటి వరకూ స్పష్టమైన నిర్ణయం తీసుకోని బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది.

పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ

పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ "వరల్డ్‌కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఆడాలి. కోట్లాది మంది అభిమానులు ఆ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ.. క్రికెట్‌లోకి రాజకీయాల్ని కలపడాన్ని నేను సమర్థించను. అయితే.. పుల్వామా ఉగ్రదాడిని భారత్‌ క్రికెట్‌కి ముడిపెట్టడం నన్ను నిరాశకి గురిచేసింది. పాకిస్థాన్ ఇలా ఎప్పుడూ క్రికెట్‌, రాజకీయాల్ని కలపదు. క్రీడల్ని క్రీడలుగా మాత్రమే చూడండి" అని అన్నాడు.

పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే?

పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే?

భారత్ జట్టు ఒకవేళ పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే? అప్పుడు పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించి రెండు పాయింట్లు కేటాయిస్తారు. అదే జరిగితే ఇప్పటి వరకూ ప్రపంచకప్‌లో భారత్‌పై ఒక్కసారి కూడా గెలుపొందని పాకిస్థాన్‌ను చేజేతులా మనమే తొలిసారి గెలిపించినట్లవుతుందని దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్‌లు అన్నారు.

మరోసారి పాకిస్థాన్‌ను ఓడించాలి

మరోసారి పాకిస్థాన్‌ను ఓడించాలి

అలాకాకుండా మరోసారి పాకిస్థాన్‌ను ఓడించాలని వారిద్దరూ సూచించారు. బీసీసీఐ మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేసింది. ఇక పుల్వామా ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, February 23, 2019, 12:40 [IST]
Other articles published on Feb 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X