న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్విన్‌ కన్నా పెద్ద స్పిన్నర్‌ లేడు: మాజీ స్పిన్‌ దిగ్గజం

Saqlain Mushtaq said No bigger spinner than Ravichandran Ashwin in home conditions

ఇస్లామాబాద్: భారత్‌లో సీనియర్‌ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ను మించిన పెద్ద స్పిన్నర్‌ లేడని పాకిస్థాన్‌ స్పిన్‌ దిగ్గజం‌ సక్లెయిన్‌ ముస్తాక్‌ అభిప్రాయపడ్డాడు. అశ్విన్‌ స్వదేశంలో ప్రమాదకర బౌలర్‌ అని చెప్పాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ను సైతం సక్లెయిన్‌ కొనియాడాడు. లయన్‌ ప్రస్తుతం మంచి బౌలింగ్‌ చేస్తున్నాడని.. ఇంగ్లండ్, పాకిస్థాన్‌, భారత జట్లపై అద్భుత ప్రదర్శన చేశాడన్నాడు. సక్లెయిన్‌ పాక్ జట్టు అంతర్జాతీయ ఆటగాళ్ల అభివృద్ధి చీఫ్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా సక్లెయిన్‌ ముస్తాక్‌ ఓ పాక్‌ మీడియాతో మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ మంచి ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఇంగ్లండ్, పాకిస్థాన్‌, భారత జట్లపై బాగా బౌలింగ్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా బాగుంది. ఇతర స్పిన్నర్ల గురించి మాట్లాడితే.. రవిచంద్రన్‌ అశ్విన్‌ స్వదేశంలో ప్రమాదకర బౌలర్‌. విదేశీ మ్యాచ్‌లలో కూడా బాగానే బౌలింగ్ చేసినా.. అతని స్వదేశీ రికార్డులే బాగున్నాయి. భారత్‌లో స్పిన్ విభాగంలో అశ్విన్‌కి మించిన పెద్ద బౌలర్‌ లేడు' అని అన్నాడు.

'టెస్టుల్లో రవీంద్ర జడేజా బాగా ఆడతాడు. టీ20 క్రికెట్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ ఉన్నాడు. అతడంటే నాకు చాలా ఇష్టం. అతడికి పెద్ద మనసు ఉంది. ఇదివరకు 5-6 సార్లు అతడిని కలిసి మాట్లాడాను. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటాడు. క్రికెట్‌పై మంచి పరిజ్ఞానం ఉంది' అని సక్లెయిన్‌ తెలిపాడు. అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరు పొందిన సక్లయిన్‌.. పాక్‌ తరపున 49 టెస్టులు, 169 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు.

Saqlain Mushtaq said No bigger spinner than Ravichandran Ashwin in home conditions

భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌లన పోల్చడం సరికాదన్నాడు. 'వాళ్లిద్దరూ గొప్ప ఆటగాళ్లు. ఇద్దిరికీ మంచి నైపుణ్యం ఉంది. మానసికంగా దృఢంగా ఉంటారు. వాళ్లకు బాగా పరుగులు చేయాలనే కసి, పట్టుదలా ఉన్నాయి. కానీ కోహ్లీ దూకుడు స్వభావం గలవాడు. ఈ విషయంలో బాబర్‌ వినయంగా ఉంటాడు. ప్రశాంతంగా ఉండే అతడి స్వభావమే కోహ్లీపై పైచేయి సాధించేందుకు తోడ్పడుతుంది. అలాంటి స్వభావాలు గలవారి మధ్య పోటీ ఉంటుంది. అందులో ప్రశాంతంగా ఉండేవాళ్లే గెలుస్తారు' అని పాక్‌ దిగ్గజం చెప్పుకొచ్చాడు. కోహ్లీ శారీరకంగా దృఢంగా ఉంటాడని, బాబర్‌ అలా కనిపించకపోయినా ఫిట్‌గా ఉంటాడన్నాడు. అయితే బాబర్‌ అలా కాలం అలా ఉంటాడో తెలియదన్నాడు.

కోహ్లీలో ఉన్న ఆ టాలెంట్ రోహిత్‌లో లేదు: గంభీర్కోహ్లీలో ఉన్న ఆ టాలెంట్ రోహిత్‌లో లేదు: గంభీర్

Story first published: Tuesday, June 16, 2020, 14:01 [IST]
Other articles published on Jun 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X