న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధావన్, రోహిత్ లోపాలను సరిదిద్దా.. బ్యాట్స్‌మెన్‌ పాత టెక్నిక్‌లు వదిలేసేలా కృషిచేశా'

Sanjay Bangar reveals inputs shared with Virat Kohli, Rohit Sharma, Shikhar Dhawan to improve batting

ముంబై: ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మల బ్యాటింగ్ లోపాలను సరిదిద్దా. బ్యాట్స్‌మెన్‌ కొన్ని పాత పద్ధతులు, టెక్నిక్‌లు వదిలేసేలా అప్పటి కోచ్ డంకన్‌ ఫ్లెచర్ నేతృత్వంలో కృషిచేశా అని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపారు. ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడడం, ఎంఎస్ ధోనీని దిగువ స్థానంలో పంపడం, ఇక ఐదేళ్లలో నాలుగో స్థానంలో సరైన ఆటగాడిని తయారు చేయడంలో విఫలం కావడంతో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ బంగర్‌పై వేటు పడింది. అతడి స్థానంలో విక్రమ్ రాథోడ్‌ని నియమించింది.

ప్రపంచకప్‌ 2019.. నాలుగో స్థానం సమిష్టి నిర్ణయం: బంగర్ప్రపంచకప్‌ 2019.. నాలుగో స్థానం సమిష్టి నిర్ణయం: బంగర్

 విరామం ఉపయోగపడుతుంది:

విరామం ఉపయోగపడుతుంది:

తాజాగా సంజయ్ బంగర్ మాట్లాడుతూ... 'బ్యాటింగ్ కోచ్ పదవి నుండి తప్పించడం బాధగా ఉంది. అయితే ఆ బాధ కొన్ని రోజులు మాత్రమే. ఐదేళ్లు భారత జట్టుకు సేవలందించాను. ఈ అవకాశం కల్పించిన బీసీసీఐ, డంకన్ ఫ్లెచర్, అనిల్ కుంబ్లే, రవిశాస్త్రిలకు ధన్యవాదాలు. తాజా ఆలోచనలు చేసేందుకు, తనపై తాను సమయం పెట్టేందుకు ఈ విరామం ఉపయోగపడుతుంది' అని తెలిపాడు.

 సైడ్ ఆటగాడిగా భావించారు:

సైడ్ ఆటగాడిగా భావించారు:

'రోహిత్‌, ధావన్, రహానె, పుజారా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో మార్పులు చేశా. లోపాలు సరిదిద్దుకొనేందుకు కోహ్లీ ఎప్పటికీ ప్రయత్నిస్తుంటాడు. క్రీజులో అతడు నిలబడే విధానం, వేగంగా బంతులు వచ్చే పరిస్థితుల్లో బ్యాటింగ్‌పై మేం కలిసి పనిచేశాం. ధావన్ తొలుత ఆఫ్‌సైడ్‌ ఎక్కువగా ఆడేవాడు. దీంతో అతను ఆఫ్ సైడ్ ఆటగాడిగా అందరూ భావించారు. కానీ.. ఇప్పుడు మైదానంలోని ఇతర ప్రదేశాల్లోనూ పరుగులు చేసేలా మార్చాం. షార్ట్‌పిచ్‌ బంతులకు ఔటవ్వకుండా శిక్షణ ఇచ్చాం' అని బంగర్ తెలిపాడు.

ఆ వార్తలు అవాస్తవం:

ఆ వార్తలు అవాస్తవం:

'మీదికి దూసుకొచ్చే బంతులకు ఎల్బీ కాకుండా రోహిత్‌ శర్మ తలను నిలపడంపై పనిచేశాం. పుజారా స్టాన్స్‌ మధ్య ఖాళీని తగ్గించాం. బ్యాట్స్‌మెన్‌ కొన్ని పాత పద్ధతులు, టెక్నిక్‌లు వదిలేసేలా డంకన్‌ నేతృత్వంలో కృషిచేశా. సెలక్టర్‌ దేవాంగ్‌ గాంధీతో అమర్యాదగా ప్రవర్తించినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. ఇప్పట్లో బయట జట్లకు కోచింగ్‌ ఇచ్చే అవకాశం లేదు' అని బంగర్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, September 12, 2019, 15:28 [IST]
Other articles published on Sep 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X