న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సానియా-షోయబ్‌ల సంతానానికి పాక్ పౌరసత్వమా..?

Sania Mirza and Shoaib Malik’s son will not be granted Pakistani citizenship

హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ కొద్ది రోజుల క్రితమే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి తల్లిదండ్రులయ్యారు. ఆ ఆనందాన్ని షోయబ్ మాలిక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'ఆ అల్లాహ్ దయతో మేము మగబిడ్డకు తల్లిదండ్రులయ్యాం. మీ అందరి ప్రార్థనలతో తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. అందరికీ కృతజ్ఞతలు.' అంటూ పోస్టు చేశాడు.

దీంతో అక్కడి ఉర్దూ మీడియా బాబుకు పాకిస్తాన్ పౌరసత్వం వర్తించదంటూ సూచించింది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకారం.. పాకిస్తాన్ పాస్‌పోర్టు.. ఇమిగ్రేషనల్ నియమాల అనుసరించి అతనికి భారత పౌరసత్వం రాదు. ఇందులో గమనించాల్సిన విషయమేమిటంటే పాకిస్తాన్ 19 దేశాలతో కలిసి ద్వంద్వ పౌరసత్వం కల్పించే సౌకర్యం ఉంది. కేవలం భారత్‌తో మాత్రమే అందుకు సమ్మతంగా లేదు.

షోయబ్ మాలిక్‌తో వివాహానంతరం సైతం సానియామీర్జా తన భారత పౌరసత్వాన్ని వీడలేదు. దీంతో అప్పట్లో మీడియా షోయబ్ మాలిక్‌ను మీకు పుట్టబోయే సంతానం.. భారత పౌరసత్వమా.. పాకిస్తాన్ పౌరసత్వమా రెండింటిలో ఏది పొందుతాడనే ప్రశ్నకు అదేదైనా తమకు సమ్మతమేనని తెలిపాడు. అది పెద్ద విషయం కాదని కొట్టిపరేశాడు.

దీనిని బట్టి చూస్తే ఆ సంతానానికి భారత పౌరసత్వమే వర్తిస్తుందేమో..! రెండు రోజుల క్రితం కలిగిన ఈ సంతానానికి సానియా-షోయబ్‌లు ఇఝాన్ మీర్జా-మాలిక్ అని పేరు పెట్టారు. ఉర్దూ పదమైన ఇఝాన్ అంటే దేవుడి బహుమతి అని అర్థం. ఇక మీర్జా-మాలిక్ అంటే ఉభయుల ఇంటి పేర్లను జత కలిపారు.

Story first published: Friday, November 2, 2018, 14:46 [IST]
Other articles published on Nov 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X