న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏడు నెలల తర్వాత.. భర్త షోయబ్ మాలిక్‌ని కలిసిన సానియా మీర్జా!!

Sania Mirza meets Shoaib Malik after seven months

దుబాయ్: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఎట్టకేలకు తన భర్త, పాకిస్తాన్‌ క్రికెట్‌ ఆల్‌రౌండర్ షోయాబ్‌ మాలిక్‌ను కలిశారు. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడు నెలల తర్వాత దుబాయ్‌లో మాలిక్‌ను సానియా కలిశారు. షోయాబ్‌ మాలిక్ ఇంగ్లండ్ టూర్‌ ముగించుకుని తాజాగా దుబాయ్‌కి చేరుకోగా.. హైదరాబాద్ నుంచి తన కొడుకు ఇజాన్ మీర్జా ‌మాలిక్‌తో కలిసి సానియా మీర్జా అక్కడికి వెళ్లారు. దీంతో ఇద్దరు ఆనందం వ్యక్తం చేశారు.

సీపీఎల్‌ ఫైనల్లో తడబడ్డ సెయింట్ లూసియా బ్యాట్స్‌మన్‌.. స్కోర్ 154/10.. ట్రిన్‌బాగో చేధించేనా?సీపీఎల్‌ ఫైనల్లో తడబడ్డ సెయింట్ లూసియా బ్యాట్స్‌మన్‌.. స్కోర్ 154/10.. ట్రిన్‌బాగో చేధించేనా?

తీవ్ర నిరాశ:

తీవ్ర నిరాశ:

అమెరికాకు టెన్నిస్ టోర్నమెంట్ కోసం వెళ్లిన సానియా మీర్జా లాక్‌డౌన్ ముందు హైదరాబాద్ చేరుకోగా.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌ (పీఎస్‌ఎల్)లో ఆడుతూ షోయబ్ మాలిక్ అక్కడే చిక్కుకుపోయాడు. లాక్‌డౌన్ కారణంగా అంతర్జాతీయంగా విమానాల నిలిపివేతతో దాదాపు ఐదు నెలలుగా సానియా, షోయాబ్‌లు దూరంగా ఉన్నారు. దీంతో భారత టెన్నిస్‌ స్టార్ సానియా తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌లో కూడా తెలిపారు. ఇజాన్ తన తండ్రిని చూడలేకపోతున్నాడు అని భావోద్వేగం చెందారు.

పీసీబీ అనుమతి లభించినా:

పీసీబీ అనుమతి లభించినా:

ఇక జులైలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు ముందు కుటుంబంతో గడిపేందుకు కొంత సమయం ఇవ్వమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని షోయాబ్ మాలిక్ అభ్యర్థించాడు. కుటుంబంను కలిసేందుకు పీసీబీ నుంచి మాలిక్‌కు అనుమతి లభించినా.. పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి పర్మీషన్ దక్కలేదు. దీంతో ఇక చేసేదిలేక పాక్ నుంచి నేరుగా ఇంగ్లండ్ పర్యటనకి మాలిక్‌కి వెళ్లిపోయాడు. ఆ టూర్ ముగిసిన అనంతరం మాలిక్‌ పాక్ వెళ్లకుండా.. యూఏఈలో ఆగాడు. తాజాగా హైదరాబాద్ నుంచి తన కొడుకు ఇజాన్‌తో కలిసి సానియా మీర్జా అక్కడకు వెళ్లారు.

దుబాయ్‌లో కొన్ని రోజులు:

దుబాయ్‌లో కొన్ని రోజులు:

ఇజాన్‌తో దుబాయ్‌లో తాను ఆడుకుంటున్న వీడియోని సోషల్ మీడియాలో షోయబ్ మాలిక్ పోస్ట్ చేశాడు. దుబాయ్‌లో కొన్ని రోజులు ఉన్న తర్వాత పాకిస్థాక్‌కి మాలిక్, సానియా మీర్జా వెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఆశించిన మేర రాణించలేకపోయిన మాలిక్.. ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. అంతర్జాతీయ కెరీర్‌లో మాలిక్ ఇప్పటివరకు 35 టెస్టుల్లో, 287 వన్డేల్లో, 116 టీ20 మ్యాచ్‌ల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సానియా మీర్జా, షోయబ్‌ మాలిక్‌ల వివాహం 2010 ఏప్రిల్ 12న జరిగింది. హైదరాబాద్‌లో సంప్రదాయ పద్దతిలో మాలిక్‌ను సానియా వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఓ కుమారుడు జన్మించాడు.

Story first published: Thursday, September 10, 2020, 23:01 [IST]
Other articles published on Sep 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X