న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్: కోహ్లీకి విశ్రాంతి, మండిపడ్డ సందీప్ పాటిల్

 Sandeep Patil slams selectors decision to rest Virat Kohli for Asia Cup

హైదరాబాద్: శనివారం నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వర్క్ లోడ్, రాబోయే సిరిస్‌లను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కోహ్లీకి విశ్రాంతిని ఇవ్వడంపై టీమిండియా మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్ మండిపడ్డారు.

<strong>స్లెడ్జింగ్ ఏ రేంజిలో అంటే: ఆ ఆసీస్ ప్లేయర్ నన్ను 'ఒసామా' అని పిలిచాడు</strong>స్లెడ్జింగ్ ఏ రేంజిలో అంటే: ఆ ఆసీస్ ప్లేయర్ నన్ను 'ఒసామా' అని పిలిచాడు

ఉపఖండంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ టోర్నీ నుండి కోహ్లీ తప్పుకునే దానికి బదులు, అక్టోబర్‌లో స్వదేశంలో వెస్టిండిస్‌తో జరిగే సిరీస్ నుంచి తప్పుకొని ఉండి ఉంటే బాగుండేదని అన్నారు. అంతేకాదు నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు ముందు విశ్రాంతి తీసుకుంటే బాగుండేదని సందీప్ పాటిల్ అభిప్రాయపడ్డారు.

ఆసియా కప్ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 18న తొలి మ్యాచ్‌లో భాగంగా

ఆసియా కప్ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 18న తొలి మ్యాచ్‌లో భాగంగా

భారత జట్టు హాంకాంగ్‌తో తలపడనుంది. ఆ తర్వాతి రోజే చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో దుబాయి వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకమని పేర్కొన్నారు. మొత్తం ఆరు జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నీలో భారత్‌, పాకిస్థాన్‌ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.

ఆటగాళ్లపై ఒత్తిడిని తాను అర్థం చేసుకోగలను

ఆటగాళ్లపై ఒత్తిడిని తాను అర్థం చేసుకోగలను

"ఒక మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా.... ఆటగాళ్లపై ఒత్తిడిని తాను అర్థం చేసుకోగలను. భారత్-పాక్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులు ఎంతో భావోద్వేగంతో మ్యాచ్‌ను వీక్షిస్తారు. అలాంటి మ్యాచ్‌లో కోహ్లీ అందుబాటులో లేకపోవడాన్ని ఊహించలేకపోతున్నా. ఏ సిరీస్‌కు, ఏ టోర్నమెంట్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే విషయంపై ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ మరింత కసరత్తు చేయాల్సింది" అని సందీప్ పాటిల్ అన్నారు.

ఆసియా కప్‌లో పాక్‌పై విజయం సాధించడం ఎంతో ముఖ్యం

ఆసియా కప్‌లో పాక్‌పై విజయం సాధించడం ఎంతో ముఖ్యం

"వెస్టిండీస్‌తో సిరీస్ కన్నా.. ఆసియా కప్‌లో విజయం సాధించడమే టీమిండియాకు ముఖ్యం. సారథ్యంలో అంతగా అనుభవంలేని రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు, అతడిపై పెద్ద భారమే ఉంది" అని సందీప్ పాటిల్ ఈ సందర్భంగా వివరించారు. జట్టు కూర్పులో సమతూకం, మంచి టీమ్‌ను ఎంపిక చేసుకోవడం అతనికి సవాల్‌గా మారనుందని అన్నారు.

రోహిత్‌కు తగినంత సమయం లేదు

రోహిత్‌కు తగినంత సమయం లేదు

ప్రస్తుతం రోహిత్‌కు తగినంత సమయం లేదని నిర్ణయాలను త్వరగా తీసుకోవాలని సందీప్ పటిల్ సూచించారు. ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైనప్పట్నించి భారత్-పాక్ మ్యాచ్ జరిగే వరకు ప్రతి క్షణం మ్యాచ్ కోసం సగటు అభిమాని ఆసక్తిగా ఎదురుచూస్తుంటాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ టోర్నీలో భారత్-పాక్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు (ఫైనల్‌తో కలిపి) జరిగే అవకాశాలున్నాయి.

Story first published: Saturday, September 15, 2018, 16:33 [IST]
Other articles published on Sep 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X