న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ వెనుకంజ: నోబాల్‌ గమనించని అంపైర్లపై చర్యలుండవ్!

Sanction unlikely for Ravi, Nandan as only 11 Indian umpires for IPL posting

హైదరాబాద్: చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నోబాల్‌ గుర్తించని అంపైర్‌ సుందరం రవిపై బీసీసీఐ చర్యలు తీసుకొనే అవకాశం కనిపించడం లేదు. అందుకు కారణం ఐపీఎల్‌లో 56 మ్యాచ్‌లకు కేవలం 11 మంది భారత అంపైర్లే ఉండటమే. దీంతో అంఫైర్ సుందరం రవిపై చర్యలు తీసుకునేందుకు బీసీసీఐ వెనుకంజ వేస్తోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజయానికి ఆఖరి బంతికి 7 పరుగులు అవసరమవగా.. ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ నోబాల్ విసిరాడు. కానీ ఫీల్డు అంపైర్‌ సుందరం రవి దాన్ని గమనించలేకపోయారు. దీంతో ముంబై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ

సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ

మ్యాచ్‌ ముగిశాక రీప్లేలో ఇది ఖరారైనా అప్పటికే ఆలస్యమైపోయింది. అంపైర్ల పొరపాటును బిగ్‌స్క్రీన్‌పై చూసిన కోహ్లీ.. ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. ప్రజంటేషన్‌ సమయంలో అంపైర్ల తప్పిదంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అంఫైర్లపై బీసీసీఐ చర్యలు తీసుకుంటుందంటూ వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం 17 మంది అంపైర్లే ఉన్నారు

ప్రస్తుతం 17 మంది అంపైర్లే ఉన్నారు

దీంతో "ఫీల్డ్‌, మూడో అంపైర్ బాధ్యతల్లో ప్రస్తుతం 17 మంది అంపైర్లే ఉన్నారు. అందులో 11 మంది భారతీయులు. ఎలైట్‌ ప్యానెల్‌లోని విదేశీ అంపైర్లు ఆరుగురు. వీరు కాకుండా మరో ఆరుగురు నాలుగో అంపైర్‌ బాధ్యతల్లో ఉన్నారు. మ్యాచ్‌ రిఫరీ మను నాయర్‌కు రవి, నందన్‌ చేసిన తప్పులను నివేదించడం మినహా మరే అవకాశం లేదు" అని ఓ అధికారి తెలిపారు.

రవిని తొలగించడం కుదరదన్న బీసీసీఐ

రవిని తొలగించడం కుదరదన్న బీసీసీఐ

"రవిని తొలగించడం కుదరదు. అతడి స్థానంలో మరొకరిని తీసుకుంటే పరిస్థితి దిగజారుతుంది. అందుకే అతడిపై జరిమానా సైతం విధించేందుకు ఆస్కారం లేదు. 56 మ్యాచ్‌లకు తక్కువ సంఖ్యలోనే అంపైర్లు అందుబాటులో ఉండటంతో చర్యలు తీసుకునే అవకాశం లేదు. కానీ, మ్యాచ్‌ రిఫరీ మను నాయర్‌ అంపైర్‌ రవికి నెగెటివ్‌ మార్క్‌ను వేశారు" అని ఆయన అన్నారు.

Story first published: Saturday, March 30, 2019, 14:32 [IST]
Other articles published on Mar 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X