న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా నిజాయతీని నమ్మండి, పారదర్శకంగానే ఉన్నా: జయసూర్య

Sanath Jayasuriya stresses his ‘integrity and transparency’ in response to ICC charges

న్యూ ఢిల్లీ: ఐసీసీ తనపై మోపిన రెండు అభియోగాలు ఒట్టి అబద్దాలు అంటూ కొట్టి పారేశారు. విచారణ చేపట్టిన ఐసీసీ జయసూర్యను సహకరించమని కోరగా దానికి నిరాకరించారు. అవినీతిపై విచారణకు సహరించనందుకు ఆయనపై ఐసీసీ అభియోగాలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ క్రమంలో తానెప్పుడూ నిజాయతీపరుడినని, పారదర్శకంగానే ఉన్నానని నొక్కిచెప్పారు.

 14 రోజుల్లో స్పందన తెలియజేయాలి

14 రోజుల్లో స్పందన తెలియజేయాలి

విచారణ నిమిత్తం రెండువారాల గడువునిచ్చింది. అయితే అభియోగాలు అవినీతి, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, పిచ్‌ ఫిక్సింగ్‌కు సంబంధించినవి కావని తెలిసింది. నేను 14 రోజుల్లో స్పందన తెలియజేయాలి. ఇది న్యాయ విచారణకు సంబంధించిన అంశం. ఏవైనా వ్యాఖ్యలు చేస్తే ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినట్టు అవుతుంది.

నేనెప్పుడూ నిజాయతీ, పారదర్శకంగానే

నేనెప్పుడూ నిజాయతీ, పారదర్శకంగానే

ప్రస్తుత అభియోగాలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌, పిచ్‌ ఫిక్సింగ్‌, అలాంటి అవినీతి పనులకు సంబంధించినవి మాత్రం కావు. ఆట విషయంలో నేనెప్పుడూ నిజాయతీ, పారదర్శకంగానే ఉన్నా. ఎప్పటికీ అలాగే ఉంటా'అని జయసూర్య అన్నారు. ఐసీసీ 2015లో చేపట్టిన ఓ దర్యాప్తును జయసూర్య అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. ఆ దర్యాప్తుతోనే 2016లో గాలె పిచ్‌ క్యూరేటర్‌ వర్ణవీరపై మూడేళ్ల నిషేధం పడింది.

జయసూర్య శ్రీలంక సెలక్షన్‌ కమిటీ చీఫ్‌గా

జయసూర్య శ్రీలంక సెలక్షన్‌ కమిటీ చీఫ్‌గా

ఇదే విషయంలో ఐసీసీ అడిగినా తన ఫోన్‌లోని సమాచారం ఇచ్చేందుకు జయసూర్య నిరాకరించారు. 2017లో జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో శ్రీలంక 3-2 తేడాతో సిరీస్‌ చేజార్చుకుంది. ఈ సిరీస్‌పై ఐసీసీ దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది. జింబాబ్వే సిరీస్‌ సమయంలో జయసూర్య శ్రీలంక సెలక్షన్‌ కమిటీ చీఫ్‌గా ఉన్నారు. శ్రీలంక తరఫున ఆయన 445 వన్డేలు, 110 టెస్టులు ఆడిన సంగతి తెలిసిందే.

అభియోగాలపై జయసూర్య వివరణ ఇవ్వాలని

అభియోగాలపై జయసూర్య వివరణ ఇవ్వాలని

అవినీతి నిరోధక యూనిట్‌కు సరిగ్గా సహకరించిన కారణంగా ఆర్టికల్ 2.46, ఆర్టికల్ 2.4.7 కింద జయసూర్య ఐసీసీ సోమవారం రెండు అభియోగాలు నమోదు చేసింది. తనపై వచ్చిన అభియోగాలపై జయసూర్య అక్టోబర్ 15 నుంచి 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అభియోగాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదని ఐసీసీ పేర్కొంది.

Story first published: Tuesday, October 16, 2018, 19:57 [IST]
Other articles published on Oct 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X