న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL: శామ్ కర్రాన్ కూడా ఐపీఎల్ బెస్ట్ అన్నాడు.. అందరి ఆట మెరుగవుతోంది.. మన వాళ్లది తప్ప!

Sam Curran praises IPL and fans angry indian players dont improve

ప్రపంచకప్ ఆసాంతం అద్భుతంగా రాణించి, ఇంగ్లండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ శామ్ కర్రాన్. అందుకే అతనికి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తోపాటు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు కూడా దక్కింది. ఈ విజయం అనంతరం మాట్లాడిన కర్రాన్.. తన ఆటతీరును ఐపీఎల్ మెరుగు పరిచిందని, ఐపీఎల్ ఆడిన సమయాన్ని బాగా ఎంజాయ చేశానని అన్నాడు.

ఐపీఎల్‌ ఎంజాయ్ చేశా

ఐపీఎల్‌ ఎంజాయ్ చేశా

తాను ఐపీఎల్‌లో ఆడిన కాలాన్ని బాగా ఎంజాయ్ చేశానని కర్రాన్ చెప్పాడు. అయితే గతేడాది వెన్నుగాయం కారణంగా ఐపీఎల్‌తోపాటు యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ కూడా ఆడలేదు. ఈ ప్రపంచకప్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు కానీ.. బంతితోనే ఇంగ్లండ్‌కు పలు విజయాలు అందించాడు. 'ఐపీఎల్‌లో టైం బాగా ఎంజాయ్ చేశా. నా ఆటతీరు మెరుగు పరచుకోవడానికి ఐపీఎల్ చాలా ఉపయోగపడింది' అని కర్రాన్ అన్నాడు.

ఏ జట్లకు ఆడాటంటే?

ఏ జట్లకు ఆడాటంటే?

ఐపీఎల్‌లో గతంలో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన కర్రాన్.. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌తో కలిశాడు. లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఆడాడు. అయితే గతేడాది వెన్నునొప్పి కారణంగా 2021 ఐపీఎల్ మధ్యలోనే టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీని కారణంగా గతేడాది టీ20 ప్రపంచకప్, ఐపీఎల్ రెండూ ఆడలేదు. వచ్చే ఏడాది అతను ఆడతాడో లేదో చెప్పలేం. ఆడితే మళ్లీ చెన్నై జట్టుతోనే చేరతాడా? చూడాలి.

మన వాళ్ల పరిస్థితేంటి?

మన వాళ్ల పరిస్థితేంటి?

ప్రపంచకప్‌లో రాణించిన ఆటగాళ్లందరూ కూడా ఐపీఎల్ వల్ల లబ్ది పొందిన వాళ్లే. కానీ మన భారత ప్లేయర్లు మాత్రం ఐపీఎల్‌లో ఆడి అసలు టోర్నీల్లో చేతులెత్తేస్తుంటారు. టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్.. ఐపీఎల్‌లో తెగ పరుగులు చేస్తాడు. ప్రపంచకప్‌లో మాత్రం బంతిని బాదడానికే కష్టపడిపోయాడు. బౌలర్లు కూడా అంతే.

ఐపీఎల్‌లో అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తారు. కానీ ఐసీసీ టోర్నీల్లో భయంకరంగా పరుగులు సమర్పించుకుంటారు. అందుకే చాలా మంది అభిమానులు వీళ్లందరూ ఐపీఎల్ ఆడుకోకుండా దేశానికి ఎందుకు ఆడుతున్నారంటే మండి పడుతుంటారు. కోట్లకు కోట్లు కురిపించే ఐపీఎల్ ప్రారంభం అయ్యాక భారత జట్టు ఒక్క టీ20 ప్రపంచకప్ కూడా నెగ్గకపోవడం కూడా గమనార్హం.

Story first published: Monday, November 14, 2022, 14:52 [IST]
Other articles published on Nov 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X