హెలికాప్టర్ షాట్‌తో మ్యాచ్ ముగిస్తే ఎలా ఫీలవుతారు?: ధోని భార్యకు అభిమాని ప్రశ్న


హైదరాబాద్: సాక్షి ధోని... భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్యగా సాక్షిని అభిమానులను అభిమానిస్తారు. ధోనితో పోలిస్తే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆమె నిత్యం టచ్‌లో ఉంటారు.
అంతేకాదు ధోని, జీవాలకు సంబంధించిన అనేక ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. ప్రస్తుతం ధోని టీమిండియాతో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలోనే ధోని పుట్టినరోజు రావడంతో సాక్షి తన కుమార్తె జీవాని తీసుకుని ఇంగ్లాండ్‌కు వెళ్లింది.
మీడియాకు, అభిమానులకు దూరంగా ఉండే సాక్షి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రావడంతో "Ask me a question" పేరిట అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలచ్చింది. ఈ క్రమంలో జీవాకు ఇష్టమైన ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్ ఏంటి? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మోగ్లీ, బగీరా అంటూ సమాధానమిచ్చింది.
అభిమానులు అడిగిన ప్రశ్నలకు సాక్షి ఏవిధంగా బదులిచ్చిందో ఒక్కసారి చూద్దామా!:

ధోని హెలికాప్టర్ షాట్‌పై
అభిమాని ప్రశ్న: మేడమ్.. ఏదైనా మ్యాచ్‌లో ధోనీ తన ఫినిషింగ్ షాట్‌ను హెలికాప్టర్ షాట్‌తో ముగిస్తే మీరు ఎలా ఫీలవుతారు?
సాక్షి జవాబు: అభిమానులు ఎలా ఫీలవుతారో... నేను అంతే.

జీవాకు ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్?
అభిమాని ప్రశ్న: జీవాకు ఇష్టమైన ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్ ఏంటి?
సాక్షి జవాబు: మోగ్లీ, బగీరా.

మీ టూత్ పేస్టులో ఉప్పు ఉందా?
అభిమాని ప్రశ్న: మీ టూత్ పేస్టులో ఉప్పు ఉందా?
సాక్షి జవాబు: ఉంది.

ఎక్కడ నివాసముంటున్నారు?
అభిమాని ప్రశ్న: ప్రస్తుతం మీరు ఎక్కడ నివాసముంటున్నారు?
సాక్షి జవాబు: రాంచి. చిన్న పట్టణాలు అంటే మాకు చాలా ఇష్టం.

క్రికెట్ ఆడతారా?
అభిమాని ప్రశ్న: మీరు క్రికెట్ ఆడతారా?
సాక్షి జవాబు: లేదు.

సెలబ్రెటీ లైఫ్‌కు అలవాటుపడ్డారా?
అభిమాని ప్రశ్న: సెలబ్రెటీ లైఫ్‌కు అలవాటుపడ్డారా? ఏమైనా కష్టంగా ఉందా?
సాక్షి జవాబు: ఆ లైఫ్‌కు నేనింకా అలవాటుపడలేదు.

ధోనీపై మీ ఫస్ట్ ఇంప్రెషన్?
అభిమాని ప్రశ్న: ధోనీపై మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి?
సాక్షి జవాబు: సింపుల్. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు.

వీరిద్దరిలో ఎవర్ని కష్టంగా ఫీలవుతారు?
అభిమాని ప్రశ్న: ధోనీ, జీవా.. వీరిద్దరిలో ఎవర్ని హ్యాండిల్ చేయడం కష్టంగా ఫీలవుతారు?
సాక్షి జవాబు: ఎలాంటి కష్టం లేదు. ఇద్దరూ సహకరిస్తారు.

చెన్నై అంటే ఇష్టమా?
అభిమాని ప్రశ్న: మీకు చెన్నై అంటే ఇష్టమా?
సాక్షి జవాబు: ప్రేమ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications