న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నీ పరుగుల దాహాన్ని అలానే ఉంచు, మనసు మాట విను: సచిన్

Sachin Tendulkar Wants Virat Kohli To Stay Hungry For Runs After Edgbaston Heroics

హైదరాబాద్: మరో 24గంటల్లో మొదలుకానున్న రెండో టెస్టునుద్దేశించి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సలహాలిస్తున్నాడు. చేసిన పరుగులతో ఎప్పుడూ సంతృప్తి చెందవద్దని టీమిండియా కెప్టెన్‌ కోహ్లీకి బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సూచించాడు. 'నీ పాత్రను అద్భుతంగా నిర్వర్తిస్తున్నావు. దానిని అలానే కొనసాగించు' అని అన్నాడు.

1
42375
పరుగులపై ధ్యాస పెట్టమన్న సచిన్:

పరుగులపై ధ్యాస పెట్టమన్న సచిన్:

ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ కోహ్లీ 225బంతుల్లో 149పరుగులు చేశాడు. దానిని ఉద్దేశించి మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన ఎలా ఉంది అనే విషయం గురించి ఆలోచించకుండా పరుగులపై ధ్యాస పెట్టమన్నాడు. అసలు మొదటి టెస్టు పరాజయం తర్వాత కోహ్లీ బాధపడాల్సిన అవసర్లేదని జట్టుపరంగా 31పరుగులు తేడాతో ఓడిపోయిందంతే గానీ, కోహ్లీ అద్భుతంగా ప్రదర్శన చేశాడని.. దానికి అతను గర్వపడాలని చెప్పుకొచ్చాడు. గత పర్యటన 2014తో పోలిస్తే పది ఇన్నింగ్స్ కలిపి 134 పరుగులు చేసిన కోహ్లీ ఈ సారి కేవలం ఒకే ఇన్నింగ్స్‌లో 149పరుగులు సాధించడం గొప్పవిశేషమేనని తెలిపాడు.

జీవితంలో పనికి వస్తాయనుకుంటేనే:

జీవితంలో పనికి వస్తాయనుకుంటేనే:

‘నీ చుట్టూ జరిగే సంఘటనలతో చింతించొద్దు. నీవు నిర్దేశించుకున్న లక్ష్యంవైపు దృష్టి సారించు. ఆ దిశగా నీ మనసే నీకు మార్గదర్శనం చేస్తుంది' అని పేర్కొన్నాడు. తొలి టెస్టులో బాగానే ఆడినా చివరకు మ్యాచ్ ఫలితం 31పరుగుల తేడాతో మారిపోయింది. ఆ పరాజయాన్ని పట్టించుకోకూడదంటూ పరుగుల సాధించడమే లక్ష్యంగా సాగిపోవాలని సూచించాడు. 'నీ పరుగుల దాహాన్ని అలాగే ఉంచు. నీకు జీవితంలో పనికి వస్తాయి అనుకున్న విషయాలను అలాగే చెయ్యి.' అని చెప్పాడు.

ఎన్ని పరుగులు చేసినా.. సరిపోవు:

ఎన్ని పరుగులు చేసినా.. సరిపోవు:

‘నా అనుభవంతో చెబుతున్నా. నీవు ఎన్ని పరుగులు చేసినా అవి ఎప్పటికీ సరిపోవు' అని సచిన్‌ అన్నాడు. 'ఒక బౌలర్ కావాలనుకుంటే జట్టులో ఉన్న పది మంది బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేస్తే సరిపోతుంది. కానీ, బ్యాట్స్‌మన్ సంగతి అలా కాదు. ఎన్ని పరుగులు చేసినా సరిపోవు. ఎన్నైనా చేస్తూనే ఉండొచ్చు' అని టెండూల్కర్ వివరించాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-ఇండియాల రెండో టెస్టు గురువారం ఆరంభం కానుంది.

ధోనీ కూడా కోహ్లీని పుంజుకోమంటూ..:

ధోనీ కూడా కోహ్లీని పుంజుకోమంటూ..:

కోహ్లీ దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో ఒకడని.. అందుకు తానిప్పటికే ఎంతో సాధించానని అంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. ఇంగ్లాండ్‌తో ఆడుతున్న టెస్టు సిరీస్‌లో విజయం సాధించాలంటే ఒకొక్కరు 20వికెట్ల వరకూ తీయాలని సూచించాడు. బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్‌పైనే ఎక్కువ ధ్యాస పెట్టాలి.

Story first published: Wednesday, August 8, 2018, 17:31 [IST]
Other articles published on Aug 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X