న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెహ్వాగ్‌కు చికెన్ తినమని చెప్పింది నేనే: వెబ్ షోలో సచిన్ (వీడియో)

By Nageshwara Rao
Sachin Talks About Sehwag In A Web Show | Oneindia Telugu
Sachin Tendulkar tells how he opened up a shy Virender Sehwag, made him eat chicken

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చాలా ఏళ్ల పాటు టీమిండియా ఓపెనింగ్ జోడీకి అభిమానులను అలరించారు. అంతేకాదు భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించారు. క్రీజులో ఈ ఇద్దరూ ఉన్నప్పుడు ఒక ఎండ్‌లో సెహ్వాగ్ బౌలర్లపై విరుచుకుపడుతుంటే, మరో ఎండ్‌లో సచిన్ అతడికి సలహాలు ఇస్తూ స్కోరు బోర్డుని పరిగెత్తించేవారు.

క్రికెట్‌లో అడుగుపెట్టిన కొత్తలో సెహ్వాగ్ చాలా సైలెంట్

క్రికెట్‌లో అడుగుపెట్టిన కొత్తలో సెహ్వాగ్ చాలా సైలెంట్

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తనదైన శైలిలో ట్వీట్లు అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కొత్తలో సెహ్వాగ్ చాలా సైలెంట్‌గా ఉండేవాడట. ఈ విషయాన్ని క్రికెట్ లెజెంజ్ సచిన్‌ టెండూల్కర్ స్వయంగా వెల్లడించాడు.

 'వాట్ ఏ డక్' అనే వెబ్ షోలో సచిన్

'వాట్ ఏ డక్' అనే వెబ్ షోలో సచిన్

తాజాగా ఈ ఇద్దరూ కలిసి 'వాట్ ఏ డక్' అనే వెబ్ షోకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సచిన్ పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. "టీమిండియాలో చేరిన కొత్తలో సెహ్వాగ్‌ చాలా సైలెంట్‌గా ఉండేవాడు. నాతో మాట్లాడేవాడే కాదు. ఇద్దరం కలిసి ఓపెనింగ్‌కు బరిలోకి దిగాలి. దీంతో మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండాలని భావించాను' అని సచిన్ తెలిపాడు.

ఒకరోజు డిన్నర్‌కు ఆహ్వానించా

"సెహ్వాగ్‌ నాతో ఫ్రీగా ఉండేటట్లు చేసుకోవాలి అనుకుని ఒకరోజు డిన్నర్‌కు ఆహ్వానించా. వెంటనే సెహ్వాగ్ పాజీ నేను పూర్తిగా శాకహారిని, చికెన్‌ తినను. చికెన్‌ తింటే లావుగా కనిపిస్తా అని బదులిచ్చాడు. లావుగా కనిపించినప్పుడే చికెన్‌ తింటానని నేను అన్నాను' అని అప్పటి సంఘటనను సచిన్‌ చెప్పుకొచ్చాడు.

ఖాళీగా ఉన్న సమయంలో పాడైన వస్తువులను రిపేర్‌ చేస్తుంటా

అంతేకాదు తాను ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో పాడైన వస్తువులను రిపేర్‌ చేస్తూ ఉంటానని కూడా సచిన్ తెలిపాడు. "ఇంట్లోనే కాదు టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూడా ఇలా చేసేవాడ్ని. ఏవైనా వస్తువులను రిపేర్‌ చేసే సమయంలో నేను చాలా ఎంజాయ్‌ చేస్తాను. ఫ్యాన్‌లు, పెయింటింగ్‌లు, కిటీకీలు ఇలా అన్ని. ఈ పనులన్ని మీకెందుకు అని అంజలి అంటుండేది. కానీ, నాకు ఈ పని ఇష్టంగా ఉంటుంది" అని సచిన్‌ అన్నాడు.

Story first published: Saturday, June 9, 2018, 17:11 [IST]
Other articles published on Jun 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X