న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు సిరీస్‌లు బ్యాట్స్‌మెన్ సత్తా పెంచేదిలా ఉండాలి: సచిన్

Sachin Tendulkar reveals the key to making Test cricket thrive again, says pitches should challenge batsmen

హైదరాబాద్: ఇంగ్లాండ్ సుదీర్ఘ పర్యటనలో ఉన్న టీమిండియా బ్యాట్స్‌మెన్ రాణించాలని భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సూచనలు అందిస్తున్నాడు. మిగిలిన సిరీస్‌ల కంటే.. టెస్టు‌ మ్యాచ్‌లు బ్యాట్స్‌మెన్ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉండాలంటూ సచిన్ టెండూల్కర్ సూచించాడు. ప్రస్తుతం లార్డ్స్‌ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతుండగా.. ఇటీవల ఇంగ్లాండ్‌లో క్రికెట్ అకాడమీని స్థాపించిన సచిన్ అక్కడే ఉన్నాడు.

వన్డే, టీ20లు బౌలర్ల సామర్థ్యాన్ని పరీక్షిస్తే.. టెస్టులు బ్యాట్స్‌మెన్‌ సత్తాని చాటిచెప్తాయని సచిన్ వివరించాడు. బర్మింగ్‌హామ్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ మినహా.. మిగిలిన భారత బ్యాట్స్‌మెన్స్ అందరూ విఫలమైయ్యారు. బౌలర్లు రాణించినప్పటికీ బ్యాట్స్‌మెన్ లోపంతో జట్టు పరాజయం పాలైంది. తాజాగా లార్డ్స్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ కూడా ఫెయిలైన విషయం తెలిసిందే. దీంతో... భారత్ 107 పరుగులకే ఆలౌటైంది.

'వన్డే, టీ20లు బౌలర్‌ సామర్థ్యాన్ని తరచూ పరీక్షిస్తుంటాయి. మరి.. టెస్టులు ఇప్పుడు బ్యాట్స్‌మెన్ సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాయా..? ప్లాట్ పిచ్‌లపై టెస్టు ఆడితే ఉపయోగం ఏముంది..? బ్యాట్స్‌మెన్‌ పరుగుల పండుగ చేసుకుంటాడు. నిర్జీవమైన పిచ్‌లపై ఒకవేళ బ్యాటింగ్ చేస్తే నేను తొందరగా ఔటవను. అప్పుడు మ్యాచ్ బోర్ కొడుతుంది.. క్రమంగా ఆసక్తి కూడా సన్నగిల్లుతుంది. అందుకే.. బ్యాట్స్‌మెన్స్‌కి సవాళ్లు విసిరే టెస్టు మ్యాచ్‌లు జరగాలి' అని సచిన్ టెండూల్కర్ సూచించాడు.

సుదీర్ఘ కెరీర్‌లో మొత్తం 200 టెస్టు మ్యాచ్‌లాడిన సచిన్ టెండూల్కర్.. 329 ఇన్నింగ్స్‌లో 6 ద్విశతకాలు, 51 శతకాలు, 68 అర్ధశతకాలు సాధించాడు. ఇందులో 2,508 ఫోర్లు ,69 సిక్సర్లు ఉండగా.. చేసిన పరుగులు 15,921. కాగా, ఇటీవల స్టీవ్ స్మిత్‌ను దాటేసి టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నాడు.

Story first published: Sunday, August 12, 2018, 10:36 [IST]
Other articles published on Aug 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X