న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sachin Tendulkar రికార్డ్ బద్ధలు కొట్టే మొనగాడు అతనే..!

Mark Taylor says that Joe Root will Break Sachin Tendulkars record for most runs in Tests

లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో జో రూట్ ఇంగ్లాండ్ జట్టును విజయపథంలో నడిపించి మరోసారి ఇంగ్లాండ్ టీం హీరో అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో 115పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రూట్ కడవరకు క్రీజులో ఉండి 17టెస్టుల తర్వాత ఇంగ్లాండ్‌కు విజయం రుచి చూపించాడు. ఇకపోతే తన ఇన్నింగ్స్ ద్వారా రూట్ టెస్టుల్లో తన 26వ సెంచరీ సాధించగా.. 10,000పరుగుల మార్క్‌ను కూడా అందుకున్నాడు. ఇకపోతే టెస్ట్‌లలో 10వేల పరుగుల మైలురాయి చేరిన అతి చిన్న వయస్కుడిగా రూట్ పేరొందాడు. ఇకపోతే టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును జో రూట్ బద్దలు కొట్టొచ్చని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ టేలర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక టెస్టుల్లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్న 14వ బ్యాటర్‌గా రూట్ నిలిచిన క్రమంలో మార్క్ టేలర్ తన విశ్లేషణను అందించాడు.

అతి తక్కువ టైంలో అరుదైన ఘనత

సర్ అలెస్టర్ కుక్ తర్వాత ఇంగ్లాండ్ తరఫున 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న 2వ ఇంగ్లాండ్ ప్లేయర్‌గా రూట్ రికార్డులకెక్కాడు. ఇక 2012లో ఇంగ్లాండ్ టీం తరఫున జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన జో రూట్.. తొమ్మిదిన్నరేళ్లలో 10వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా అరంగేట్రం చేశాక అతి తక్కువ రోజుల్లో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గానూ రూట్ నిలిచాడు. 31ఏళ్ల రూట్ ప్రతిభను ఎంతో మంది క్రికెట్ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇక మార్క్ టేలర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. రూట్ అత్యధిక టెస్ట్ పరుగులు సాధించిన ఆటగాడిగా తన కెరీర్ పూర్తయ్యేసరికి నిలవగలడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక పదివేల పరుగులు పూర్తి చేసుకున్న రూట్‌ను అతను ప్రత్యేకంగా అభినందించాడు.

ఇంకో అయిదేళ్లలో రికార్డు బద్ధలు కొట్టేస్తాడు

ఇంకో అయిదేళ్లలో రికార్డు బద్ధలు కొట్టేస్తాడు

'ఇకపోతే కెరీర్‌లో 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 15,921పరుగులు చేశాడు. రూట్‌‌కు ఇప్పుడు 31ఏళ్లు. కనీసం 5సంవత్సరాలు అయినా రూట్ ఆడగలడు. ఈ అయిదేళ్లలో ఓ 50 మ్యాచ్‌లు ఆడినా.. రూట్ టెండూల్కర్ రికార్డు బద్ధలు కొట్టగలడని నేను భావిస్తున్నాను. రూట్ తన కెరీర్‌లో అత్యున్నత స్థానంలో ఉన్నాడు. కాబట్టి అతను తన ఫిట్ నెస్ లెవల్స్, కన్సిస్టెన్సీ కొనసాగిస్తే అతను ఈజీగా 15,000పరుగుల ప్లస్ స్కోరు చేయగలడు' అని టేలర్ స్కై స్పోర్ట్స్‌ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

రూట్‌కు స్టాండింగ్ ఓవియేషన్

ఇక తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ను గెలిపించిన అనంతరం రూట్.. లార్డ్స్ గ్రౌండ్లో పెవిలియన్ గుండా డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి రాగా.. పెవిలియన్ స్టాండ్స్‌లో ఉన్నవారందరు అతనికి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. అలాగే అతన్ని భుజాలు తట్టి అభినందించారు. టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అతన్ని హగ్ చేసుకుని మెచ్చుకున్నాడు. ఇక మ్యాచ్ అనంతంర స్టోక్స్ మాట్లాడుతూ..'రూట్ అంటే మిస్టర్ డిపెండబుల్, వాట్ ఎ ప్లేయర్, వాట్ ఏ మ్యాన్' అంటూ రూట్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు. రూట్ మాట్లాడుతూ.. 'నేను నాకు సాధ్యమైనన్ని రోజులు నా ఆటను కొనసాగించాలనుకుంటున్నా. మా జట్టు గెలవడం కోసం నా వంతు ఏదీ చేయాలో అది చేయడానికి శ్రమించడానికి నేనేప్పుడు సిద్ధంగా ఉంటాను. నేను కెప్టెన్సీ వదులుకున్నా.. స్టోక్స్‌కు గ్రౌండ్లో మద్దతుగా ఉంటాను. అతను విజయవంతమైన కెప్టెన్ కావడానికి నేను చేయగలిగినదంతా చేస్తాను' అని తెలిపాడు.

Story first published: Monday, June 6, 2022, 11:45 [IST]
Other articles published on Jun 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X