న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెలక్టర్ల మైండ్‌లో ఏముందో?: ధోని వేటుపై తొలిసారి సచిన్

India Vs West Indies 2018,T20I : Sachin questions Selectors Mindset Over MS Dhoni's T20I Ouster
Sachin Tendulkar questions selectors mindset over MS Dhonis T20I ouster

హైదరాబాద్: వెస్టిండిస్, ఆస్ట్రేలియాలతో రాబోయే టీ20 సిరిస్‌ల నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే. ధోనీపై వేటు వేసి సెలక్టర్లు అతని స్థానంలో రిషబ్ పంత్‌కి వికెట్ కీపర్‌గా అవకాశమిచ్చారు. సెలక్టర్ల నిర్ణయంపై ధోని అభిమానులు ఇప్పటికే తీవ్ర విమర్శలు గుప్పించారు.

సెలక్టర్ల తీరుపై కొందరు క్రికెట్ విశ్లేషకులు

సెలక్టర్ల తీరుపై కొందరు క్రికెట్ విశ్లేషకులు

ముఖ్యంగా సెలక్టర్ల తీరుపై కొందరు క్రికెట్ విశ్లేషకులు మండిపడుతుండగా మరికొందరు వారి నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. తాజాగా ధోనిపై వేటు గురించి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ "సెలక్టర్లు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? వారి ఆలోచనలేంటో? నాకు తెలియదు" అని చెప్పుకొచ్చాడు.

 డ్రెస్సింగ్ రూములో ఏం జరిగిందో

డ్రెస్సింగ్ రూములో ఏం జరిగిందో

"ఇప్పుడు నా అభిప్రాయం చెప్పి వారిని ప్రభావితం చేయాలని కూడా నేను అనుకోవట్లేదు. డ్రెస్సింగ్ రూములో ఏం జరిగింది? కెప్టెన్, కోచ్, సెలక్టర్ల మధ్య ఏవైనా చర్చలు జరిగాయా? అనే విషయాలు వారి మధ్యనే రహస్యంగా ఉండనివ్వండి. సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది జట్టు ప్రయోజనాల కోసమే అన్న విషయం గుర్తించాలి" అని సచిన్ అన్నాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం

కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం

మరోవైపు ధోని వేటుపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. రిషబ్‌ పంత్‌ లాంటి యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు దక్కాలనే ధోని స్వయంగా ఈ ఫార్మాట్‌కు దూరం అయ్యాడని కోహ్లీ చెప్పాడు. ‘‘ధోని వ్యవహారంపై సెలక్టర్లు ఇప్పటికే మాట్లాడారనుకుంటా. దీని గురించి నేనిప్పుడు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.

నేను ఆ ప్రక్రియలో భాగం కాదు

నేను ఆ ప్రక్రియలో భాగం కాదు

"వాస్తవంగా ఏం జరిగిందన్నది సెలక్టర్లు మాట్లాడారు. నేను ఆ ప్రక్రియలో భాగం కాదు. ఇందులో అంత మతలబేమీ లేదు. కెప్టెన్‌గా నేను ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నా. ధోని ఇప్పటికీ జట్టులో ఓ ముఖ్య ఆటగాడు. టీ20ల్లో పంత్‌ లాంటి యువ ఆటగాడికి ఎక్కువ అవకాశాలు దక్కాలని ధోని భావించాడు. యువ ఆటగాళ్లకు సాయం చేయాలన్నదే ధోని ఉద్దేశం. వన్డేల్లో ధోని రెగ్యులర్‌ ఆటగాడే" అని కోహ్లీ అన్నాడు.

Story first published: Friday, November 2, 2018, 17:46 [IST]
Other articles published on Nov 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X