న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యూజియం పనుల నిమిత్తం ధర్మశాలకు వెళ్లిన సచిన్ టెండూల్కర్

Sachin Tendulkar lands in Dharamsala, likely to meet Dalai Lama

హైదరాబాద్: మూడు రోజుల పర్యటనలో భాగంగా స్టార్ క్రికెటర్, టీమిండియా క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ధర్మశాల చేరుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అతనికి స్వాగతం పలికారు. అనంతరం సచిన్ బౌద్ధ మత గురువు అయిన దలైలామను సందర్శించుకున్నారు. ధర్మశాల వేదికగా హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేయనున్న క్రికెట్ మ్యూజియం పనులను సచిన్ పరిశీలించారు.

దలాదర్ కొండల చివరి భాగంలో దీని నిర్మాణం చేయనున్నారు. ఈ మ్యూజియంలో సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సచిన్ టెండూల్కర్‌తో పాటుగా కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేల విగ్రహాలను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా స్టేడియం నిర్వహకుల్లో ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ఆ మ్యూజియం ప్రారంభోత్సవం సచిన్ చేతుల మీదుగానే జరుగుతుందంటూ హామీ ఇచ్చారు.

ఇదే స్టేడియంలో సచిన్ కొడుకు కూడా ప్రాక్టీసు చేస్తుండటంతో అర్జున్ టెండూల్కర్‌ వద్దకు రాబోతున్నాడని ముందుగానే వార్తలు చక్కర్లుకొట్టాయి. ప్రస్తుతం అండర్ 25, అండర్ 19 జట్ల తరపున అర్జున్ ఆడుతున్నాడు. నిర్వహక సంఘం ప్రతినిధి మాట్లాడుతూ,.. అర్జున్ గంటల తరబడి ప్రాక్టీసు చేస్తున్నాడు. అతని శిక్షణ మే 20 వరకు కొనసాగనుంది.

మ్యూజియం ఏర్పాటుకై బీసీసీఐ స్థలం కావాలని అడగటంతో హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం 50000 చదరపు మీటర్ల ప్రాంతాన్ని కేటాయించింది. దీనికి స్పందించిన మ్యూజియం నిర్వహక సంఘం 'ఇదే స్టేడియంలో సచిన్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకోవడం హర్షించదగ్గ విషయం. అనేక రాజకీయ పరిణామాలు దాటుకుని మ్యూజియం నిర్మాణం ఇక్కడ జరుగుతుండటంతో చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Story first published: Tuesday, May 1, 2018, 16:42 [IST]
Other articles published on May 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X