న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Saba Karim: పంత్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది

Saba Karim Feels that Rishabh Pant need To Learn More

టీ20 క్రికెట్‌లో యువ వికెట్‌కీపర్ అయిన రిషబ్ పంత్ ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని.. భారత టీ20 జట్టుకు మరింత విలువైన అస్సెట్‌లా మారడానికి రిషబ్ పంత్‌ మరింత తన ఎక్స్ పోజర్ పెంచుకోవాలని మాజీ సెలెక్టర్ సబా కరీమ్ పేర్కొన్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ 11లో పంత్ సెలెక్ట్ కాలేని సంగతి తెలిసిందే. రిషబ్ పంత్ భారత్ తరపున ఇప్పటివరకు 54 టీ20లు ఆడాడు.. 25 కంటే తక్కువ సగటుతో 883పరుగులు చేశాడు. ఐపీఎల్ 2022 తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్‌ల స్వదేశీ సిరీస్‌లో భారత్‌కు కెప్టెన్సీ కూడా వహించాడు.. కానీ ఆ సిరీస్లో పూర్తిగా పంత్ విఫలమయ్యాడు. వన్డేలు, టెస్టుల్లో రాణిస్తున్న పంత్ మాత్రం టీ20ల్లో తన మార్క్ చూపించలేకపోతున్నాడు.

'రిషబ్ పంత్ టీ20 ఫార్మాట్లో కాస్త తికమక పెడుతుంటాడనేది ప్రధాన సమస్య. కానీ ఇటీవల అతను టెస్ట్ మ్యాచ్‌లలో ప్రదర్శించిన ఫామ్‌ అందుకున్నాడు. అలాగే ఇంగ్లాండ్‌పై చివరి వన్డేలో అద్భుత సెంచరీ ఇన్నింగ్స్‌ ఆడి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి మనం చూశాం. అలాగే అతని ఇన్నింగ్స్‌‌లలో కొన్ని గొప్ప గొప్ప ప్రదర్శనలు ఉన్నాయి' అని సబా కరీమ్ 'స్పోర్ట్స్ ఓవర్ ది టాప్'లో చెప్పాడు.

'బహుశా అతను స్థిరమైన ప్రదర్శన చేయలేకపోవచ్చు కానీ టీ20 క్రికెట్‌లో రిషబ్ పంత్ నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉందని నేను నమ్ముతున్నాను. అతను ఇప్పుడు చాలా మెరుగైన మెచ్చుర్ ఆటగాడిగా మారాడు. అయితే మరింత ఎక్స్‌పోజర్‌తో రిషబ్ పంత్ ఆత్మవిశ్వాసం పెంచుకుని ఆడాల్సిన అవసరముంది. అతని స్థానం భారత టీ20జట్టుకు మరింత అసెట్ కావాలి.' అని కరీమ్ పేర్కొన్నాడు. ఇకపోతే నేడు హాంకాంగ్‌తో ఇండియా తలపడనుంది. ఇకపోతే ఈ మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ 11లో రిషబ్ పంత్ ఆడే అవకాశముంది.

Story first published: Wednesday, August 31, 2022, 13:55 [IST]
Other articles published on Aug 31, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X