న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs KXIP: బంతిని బలంగా బాదడం నా జీన్స్‌లోనే ఉంది.. మా నాన్న ఫవర్‌ఫుల్ మ్యాన్: శాంసన్‌

RR vs KXIP: Sanju Samson says hitting sixes with full power is in his genes

షార్జా: ఐపీఎల్ 2020లో కేరళ యువ వికెట్ కీపర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన రెండు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలతో అడగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 74 (32 బంతుల్లో; 1x4, 9x6) పరుగులు బాదాడు. స్ట్రైక్‌రేట్‌ ఏకంగా 231.25. ఇక ఆదివారం షార్జాలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుతో జరిగిన మ్యాచులో విధ్వంసమే సృష్టించాడు.

42 బంతుల్లో 202.38 స్ట్రైక్‌రేట్‌తో 7 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 85 పరుగులు చేశాడు. 224 పరుగుల రికార్డ్ స్థాయి లక్ష్య చేధనలో ఏ మాత్రం బెదరకుండా.. అద్భుతంగా పోరాడాడు. రెండుసార్లు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'‌గా నిలిచాడు.

ఆత్మశోధన చేశాను

ఆత్మశోధన చేశాను

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'‌‌ అవార్డు అందుకున్న అనంతరం సంజూ శాంసన్ తన సక్సెస్ సీక్రెట్‌ను చెప్పాడు. 'ఏడాది కాలంగా బంతిని అద్భుతంగా బాదుతున్నాను. నా ఆటతీరులో స్పష్టమైన మార్పు గమనించాను. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ మంచి స్కోర్లు సాధించాను. ఎప్పటిలాగే ఆత్మవిశ్వాసంతో ఆడాను. మ్యాచులు గెలిపిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అనుకున్నది జరగకపోవడంతో ఎంతో కష్టపడ్డాను. ఎంతో ప్రయత్నించి చిరాకు పడ్డ తర్వాత.. ఆత్మశోధన చేశాను. నన్ను నేను వెతుకున్నాను. అదే పనిచేసింది' అని సంజూ తెలిపాడు.

మా నాన్న చాలా ఫవర్‌ఫుల్ మ్యాన్

మా నాన్న చాలా ఫవర్‌ఫుల్ మ్యాన్

'నేనేం సాధించాలని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. పదేళ్లుగా ఈ అందమైన ఆట ఆడుతున్నానని చెప్పుకున్నాను. ఈ దశాబ్దకాలంలో ఆట కోసం ఎంతో కృషి చేశాను. ఇక క్రికెట్ కోసమే పూర్తి సమయం కేటాయించాలని భావించాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ నాకు అండగా నిలిచారు. నా శక్తిసామర్థ్యాలన్నీ ఆటపైనే కేంద్రీకరించాను. ఫలితాలు వాటంతట అవే వచ్చాయి. ఇక సిక్సర్లు బాదే శక్తి గురించి చెప్పాలంటే.. అది జన్యువుల ప్రభావమే. ఎందుకంటే మా నాన్న చాలా ఫవర్‌ఫుల్ మ్యాన్. బాగా ఆడాలంటే ఫిట్‌గా ఉండాలి' అని సంజూ చెప్పాడు.

16 సిక్సర్లు

16 సిక్సర్లు

పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్య ఛేదనను రాయల్స్ చేదించిందంటే.. అదంతా సంజూ శాంసన్ మాయే. కీలక సమయంలో బ్యాట్ జులిపించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఐపీఎల్ 2020లో ఆడిన రెండు మ్యాచులలో సంజూ 159 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 16 సిక్సర్లు ఉండగా.. కేవలం 5 బౌండరీలు మాత్రమే ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇన్ని సిక్సర్లు ఇప్పటి వరకు ఎవరూ కొట్టలేదు. అంతేకాదు పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. పంజాబ్‌పై సంజూ చెలరేగిన ఆట తీరుపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, రాజకీయ నాయుకులు ప్రసంశలు కురిపిస్తున్నారు.

రెండు టీ20ల్లో 8, 2 పరుగులు

రెండు టీ20ల్లో 8, 2 పరుగులు

ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల మోత మోగించే సంజూ శాంసన్‌కు దురదృష్టవశాత్తు అంతర్జాతీయ క్రికెట్‌లో రావాల్సిన అవకాశాలు రాలేదు. ఇక రాక రాక వచ్చిన అవకాశాల్లో అతను నిరూపించుకోలేకపోయాడు. 2015 జింబాబ్వేతో జరిగిన టీ20 ద్వారా భారత జట్టులోకి వచ్చిన శాంసన్​.. మరో అవకాశం కోసం నాలుగేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. గతేడాది బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్​కు ఎంపికైనా.. తుది జట్టులో చోటు దక్కలేదు. బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న శాంసన్.. వరుసగా 8, 2 పరుగులు చేశాడు.

RR vs KXIP: ఒకే ఓవర్లో ఐదు సిక్సులు.. ఎవరీ రాహుల్ తెవాటియా.. ఆసక్తికర విషయాలు ఇవే!!

తెవాటియా బయ్యా.. చించేశావ్:

తెవాటియా బయ్యా.. చించేశావ్:

మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్ ఓ ట్వీట్ కూడా చేశాడు. 'ఆహా!!.. అద్భుతమైన మ్యాచ్. సూపర్ విక్టరీ. గత రాత్రి మ్యాచ్ చూసిన అందరికి అద్భుతమైన ఆదివారంగా మారిందని ఆశిస్తున్నా. పంజాబ్, రాజస్థాన్ జట్లు తమ ఉత్తమ ప్రదర్శన చేశాయి. రాహుల్ తెవాటియా బయ్యా.. చించేశావ్. మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇది జట్టు విజయం' అని సంజూ పేర్కొన్నాడు.

Story first published: Monday, September 28, 2020, 13:49 [IST]
Other articles published on Sep 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X