న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జైపూర్‌లో RR vs KXIP: అందరి కళ్లు స్టీవ్ స్మిత్ పైనే!

IPL 2019: Everyone's Eyes On Steve Smith's Performance In IPL
RR vs KXIP Predicted Playing 11, IPL 2019: Steve Smith returns to action

హైదరాబాద్: ఐపీఎల్‌ 2019 సీజన్ సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. లీగ్‌ ఆరంభ మ్యాచ్‌ అభిమానులను నిరాశపరిచినప్పటికీ ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లను క్రికెట్ అభిమానులు తెగ ఎంజాయ్‌ చేసేశారు. ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఎంట్రీ అదిరింది. తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించి తన తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇప్పుడు స్టీవ్ స్మిత్ వంతు

ఇప్పుడు స్టీవ్ స్మిత్ వంతు

ఇక, స్టీవ్ స్మిత్ వంతు వచ్చింది. సోమవారం జైపూర్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. డేవిడ్ వార్నర్‌, స్టీవ్ స్మిత్‌ బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ 2018 సీజన్‌కు కూడా వీరిద్దరూ దూరమయ్యారు.

వరల్డ్‌కప్ జట్టులో చోటు!

వరల్డ్‌కప్ జట్టులో చోటు!

అయితే, తాజా సీజన్‌లో వీరిద్దరూ ప్రాతినిథ్యం వహిస్తోన్న జట్లలోకి తిరిగి వచ్చారు. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌‍కప్ జట్టులోకి ఎంపికయ్యే అవకాశమున్న ఈ ఇద్దరూ ఐపీఎల్ ద్వారా లయ అందుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా డేవిడ్ వార్నర్ ఆడిన తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో రాణించి సత్తా చాటాడు.

మోచేతి గాయం నుంచి కోలుకుంటున్న స్మిత్

మోచేతి గాయం నుంచి కోలుకుంటున్న స్మిత్

ఇప్పుడు స్టీవ్ స్మిత్ వంతు వచ్చింది. సోమవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో రాత్రి 8 గంటలకు జరిగే మ్యాచ్‌లో స్మిత్ కూడా అదే తరహాలో చెలరేగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. సొంత మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ జట్టుకు ఆజింక్యె రహానే కెప్టెన్‌గా వ్వవహారించనున్నాడు. మోచేతి గాయం నుంచి కోలుకుంటున్న స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్‌తో బ‌రిలో దిగుతాడో లేదో చూడాలి.

జట్ల అంచనా:

జట్ల అంచనా:

రాజస్థాన్‌: ఆజింక్య రహానె(కెప్టెన్‌) జోస్‌ బట్లర్‌(వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్‌, స్టీవ్‌ స్మిత్‌, బెన్‌స్టోక్స్‌, రాహుల్‌ త్రిపాఠి, కృష్ణప్ప గౌతం, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయాస్‌ గోపాల్‌, ధవల్‌ కులకర్ణి, జయదేవ్‌ ఉనద్కత్‌

పంజాబ్‌: అశ్విన్‌(కెప్టెన్‌) అశ్విన్‌(కెప్టెన్‌), క్రిస్‌గేల్‌, లోకేశ్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, మన్‌దీప్‌ సింగ్‌, శామ్‌ కరన్‌, ముజీబ్‌ రహమాన్‌, ఆండ్రూ టై, వరుణ్‌ చక్రవర్తి, మహ్మద్‌ షమీ

రాత్రి 8 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

Story first published: Monday, March 25, 2019, 15:25 [IST]
Other articles published on Mar 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X