న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారి కోసమే కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు: శిఖర్ ధావన్

IND Vs SL,3rd T20I : Shikhar Dhawan Revealed Management's Plan Behind World Cup !
Rotating players so that everyones refined for the World Cup: Shikhar Dhawan after Pune win

హైదరాబాద్: బ్యాటింగ్‌ లైనప్‌లో ప్రయోగాలకు ఇదే సరైన సమయమని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. శుక్రవారం పూణె వేదికగా శ్రీలంకతో జరిగిన చివరిదైన మూడో టీ20లో బ్యాటింగ్ ఆర్డర్‌లో యువ ఆటగాళ్లు శాంసన్‌, మనీష్‌ పాండేలను ముందు పంపిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో మూడు స్థానంలో ఆడే విరాట్ కోహ్లీ ఆ స్థానంలో కాకుండా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. కోహ్లీ ఎప్పుడూ ఆడే మూడో స్థానంలో సంజు శాంసన్ ఆడగా శ్రేయస్‌ నాలుగో స్థానంలో, పాండేను ఐదో స్థానంలో జట్టు మేనేజ్‌మెంట్ బ్యాటింగ్‌కు పంపింది.

<strong>మ్యాక్స్‌వెల్ మెరుపులు: ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ ఓడిన మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌</strong>మ్యాక్స్‌వెల్ మెరుపులు: ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ ఓడిన మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌

ధావన్‌ మాట్లాడుతూ

ధావన్‌ మాట్లాడుతూ

దీనిపై మ్యాచ్‌ అనంతరం ధావన్‌ మాట్లాడుతూ "గాయంతో దాదాపు నెలరోజులు జట్టుకు దూరమయ్యా. ఆ సమయంలో ప్రాక్టీస్‌పైనే దృష్టి సారించాను. తిరిగి బరిలోకి దిగిన నాకు సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతి ఒక్కరికి సవాళ్లు ఉంటాయి. ఓపెనర్‌గా నేను బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తుంటా" అని అన్నాడు.

చెత్త బంతుల్ని బౌండరీలుగా

చెత్త బంతుల్ని బౌండరీలుగా

"లసిత్ మలింగ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు ఇన్‌స్వింగర్‌ యార్కర్లను ఎక్కువగా సంధిస్తుంటాడు. దీంతో ఈ మ్యాచ్‌లో నా ప్రణాళికను మార్చుకున్నా. మంచి బంతుల్ని ఎదుర్కొన్నప్పుడు స్ట్రైక్‌ రొటేట్‌ చేశాను. చెత్త బంతుల్ని బౌండరీలుగా మలిచాను. మొత్తంగా ఈ సిరీస్‌లో శ్రీలంకపై మేము పైచేయి సాధించాం" అని ధావన్ అన్నాడు.

ప్రయోగాలకు ఇదే సరైన సమయం

ప్రయోగాలకు ఇదే సరైన సమయం

"బ్యాటింగ్‌ లైనప్‌లో ప్రయోగాలకు ఇదే సరైన సమయం. ఇందులో భాగంగా ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌కు రాని వారికి అవకాశాల ఇవ్వాలని నిర్ణయించాం. అందుకే సంజు శాంసన్‌, మనీశ్‌ పాండే మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చారు. వరల్డ్‌కప్‌కు ముందు మనకు ఇంకా 15-20 మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి" అని ధావన్ చెప్పాడు.

శార్దూల్ ఠాకూర్‌ అద్భుతంగా ఆడాడు

శార్దూల్ ఠాకూర్‌ అద్భుతంగా ఆడాడు

"శార్దూల్ ఠాకూర్‌ అద్భుతంగా ఆడాడు. పరిమిత ఓవర్లలో మంచి ఆల్‌రౌండర్‌గా అతడు జట్టుకు ఎంతో ఉపయోగపడతాడు'' అని గబ్బర్‌ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ధావన్ 36 బంతుల్లోనే 7 ఫోర్లు, సిక్సర్‌తో అతడు 52 పరుగులు సాధించాడు. పూణె టీ20లో టీమిండియా 78 పరుగుల తేడాతో విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్‌ను 2-0తేడాతో కైవసం చేసుకుంది.

Story first published: Saturday, January 11, 2020, 14:48 [IST]
Other articles published on Jan 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X