న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెంచరీతో సచిన్, కోహ్లీ రికార్డుని అధిగమించిన రాస్ టేలర్

Ross Taylor scores hundred against Sri Lanka, overtakes Sachin Tendulkar & Virat Kohli

హైదరాబాద్: నెల్సన్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ అరుదైన రికార్డు సాధంచాడు. ప్రస్తుతం స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌‌లో రాస్ టేలర్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.

<strong>ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేనకు బీసీసీఐ నజరానా</strong>ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేనకు బీసీసీఐ నజరానా

మంగళవారం జరిగిన మూడో వన్డేలో 137 పరుగులతో రాస్ టేలర్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో రాస్ టేలర్‌కు ఇది 20వ సెంచరీ కావడం విశేషం. ఫలితంగా న్యూజిలాండ్ తరుపున వన్డేల్లో 20 సెంచరీలు చేసిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

వన్డేల్లో వరుసగా ఆరుసార్లు 50కి పైగా స్కోరు

అదే సమయంలో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లీల రికార్డుని సైతం రాస్ టేలర్ అధిగమించాడు. వన్డేల్లో వరుసగా ఆరుసార్లు 50కి పైగా స్కోర్ చేసిన ఆటగాడిగా రాస్ టేలర్ తన ఖాతాలో అరుదైన రికార్డుని వేసుకున్నాడు. గత ఆరు వన్డేల్లో 181, 80, 86, 54, 90, 137 స్కోర్లు నమోదు చేశాడు.

సచిన్, కోహ్లీని అధిగమించిన రాస్ టేలర్

భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వన్డేల్లో వరుసగా ఐదుసార్లు 50కిపైగా పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ 2012లో వరుసగా ఐదు వన్డేల్లో 133, శ్రీలంకపై 108, బంగ్లాదేశ్‌పై 66, పాకిస్థాన్‌పై 83, శ్రీలంకపై 106 స్కోర్లు సాధించాడు. తాజా సెంచరీతో రాస్ టేలర్ వీరిద్దరిని దాటేశాడు.

కేన్ విలియమన్స్‌ సరసన నిలిచిన టేలర్

అంతేకాదు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమన్స్‌ సరసన నిలిచాడు. 2015లో కేన్ విలియమ్సన్ వరుసగా ఆరు సార్లు 50కిపైగా పరుగులు చేశాడు. ఈ జాబితాలో పాక్ మాజీ దిగ్గజ ఆటగాడు జావేద్ మియాందాద్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 1987లో మియాందాద్ ఏకంగా తొమ్మిదిసార్లు 50కిపైగా స్కోర్లు సాధించాడు.

3-0తో వన్డే సిరిస్‌ను క్లీన్ స్వీప్

3-0తో వన్డే సిరిస్‌ను క్లీన్ స్వీప్

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 364 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో రాస్ టేలర్ (137), హెన్రీ నికోల్స్ (124) సెంచరీలు చేశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 41.4 ఓవర్లలో 249 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 115 పరుగుల తేడాతో విజయం సాధించి 3-0తో వన్డే సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

Story first published: Tuesday, January 8, 2019, 18:19 [IST]
Other articles published on Jan 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X