న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండిస్‌తో వన్డే సిరిస్‌కు ముందు విజయ్ హాజారే ట్రోఫీలో రోహిత్ శర్మ

India vs WestIndies 2018: Rohit Sharma Plays To His Native Team Before Test Match | Oneindia Telugu
Rohit Sharma will play Vijay Hazare Trophy to prepare for Windies series

హైదరాబాద్: జాతీయ జట్టులో ఆడిన ఆటగాళ్లు దేశవాళీ టోర్నీల్లో తమ రాష్ట్రాలకు సంబంధించిన జట్లకు ఆడటం చాలా పెద్ద ప్లస్. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా వ్వవహారిస్తోన్న రోహిత్ శర్మ విజయ్ హాజారే ట్రోఫీ నాకౌట్ గేమ్స్‌కు ముంబై జట్టు తరుపున ఆడనున్నాడు.

ఏపీఎల్: రషీద్ ఖాన్ వీరవిహారంపై చీకి మేసెజ్ పెట్టిన డానియెల్లి వాట్ఏపీఎల్: రషీద్ ఖాన్ వీరవిహారంపై చీకి మేసెజ్ పెట్టిన డానియెల్లి వాట్

ఈ మేరకు ముంబై క్రికెట్ ఆసోసియేషన్(ఎంసీఏ) ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ "అవును, విజయ్ హాజారే ట్రోఫీకి రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడు. అక్టోబర్ 10న జట్టుని ఎంపిక చేస్తాం" అని అన్నాడు. మరోవైపు ఎంసీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ "ముంబై తరుపున రోహిత్ ఒకటి లేదా రెండు గేమ్స్ ఆడనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో ముంబై ఆడనుంది. లీగ్ స్టేజిలో గత రెండు గేమ్స్‌కు అతడే నాయకత్వం వహించాడు" అని తెలిపారు.

ఆసియా కప్‌లో రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో

ఆసియా కప్‌లో రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో

ఇటీవలే యూఏఈ వేదికగా ముగిసిన ఆసియా కప్‌లో రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు పైనల్లో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ప్రస్తుతం వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు అతడిని ఎంపిక చేస్తారని అంతా భావించారు.

వెస్టిండిస్‌తో టెస్టు సిరిస్‌లో దక్కని చోటు

వెస్టిండిస్‌తో టెస్టు సిరిస్‌లో దక్కని చోటు

అయితే, సెలక్టర్లు మాత్రం అతడికి మొండిచేయి చూపించారు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ అనంతరం పర్యాటక వెస్టిండిస్ జట్టుతో టీమిండియా 5 వన్డేలు, 3 టీ20ల సిరిస్ ఆడనుంది. ఈ నేఫథ్యంలో రోహిత్ శర్మ తనకు కాస్త ప్రాక్టీస్ లభిస్తుందనే ఉద్దేశంతోనే విజయ్ హాజారే ట్రోఫీలో ఆడేందుకు అంగీకరించాడు.

ధోని కూడా ఆడితే బాగుంటుందన్న గవాస్కర్

ధోని కూడా ఆడితే బాగుంటుందన్న గవాస్కర్

ఇదే, విజయ్ హాజారే ట్రోఫీలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఆడితే బాగుంటుందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించిన సంగతి తెలిసిందే. అయితే, ధోని ఈసారి విజయ్ హజారే ట్రోఫీలో సొంత రాష్ట్రం తరఫున బరిలో దిగడం లేదు. ఈ మేరకు జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.

 అక్టోబర్ 21 నుంచి భారత్-విండిస్ జట్ల మధ్య తొలి వన్డే

అక్టోబర్ 21 నుంచి భారత్-విండిస్ జట్ల మధ్య తొలి వన్డే

‘జట్టుతోపాటు ధోనీ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మెంటార్‌ పాత్ర పోషిస్తున్న ధోనీ.. ఇతర ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నాడు' అని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా వెస్టిండీస్‌ జట్టుతో టీమిండియా తన తొలి వన్డేని అక్టోబరు 21 నుంచి ఆడనుంది.

Story first published: Tuesday, October 9, 2018, 15:51 [IST]
Other articles published on Oct 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X