For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాంటింగ్‌ రికార్డుపై రోహిత్.. సచిన్‌ రికార్డుపై కోహ్లీ కన్ను!!

Rohit Sharma, Virat Kohli eye batting milestones in India vs Australia ODIs

ముంబై: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే ముంబై వేదికగా ఈ రోజు (మంగళవారం) జరగనుంది. వన్డే ప్రపంచకప్‌-2019 లీగ్‌ దశలో ఎదురుపడ్డ తర్వాత రెండు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ ఇదే. గతేడాది బలహీన జట్టుతో భారత్‌లో అడుగుపెట్టి టీ20, వన్డే సిరీస్‌లు చేజిక్కించుకున్న ఆసీస్‌ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు కోహ్లీసేన ప్రతీకారం తీర్చుకునేందుకు తహతహలాడుతోంది.

 మరో 128 పరుగులు చేస్తే:

మరో 128 పరుగులు చేస్తే:

తొలి వన్డే నేపథ్యంలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డులకు చేరువలో ఉన్నారు. రోహిత్‌.. పాంటింగ్‌ రికార్డుపై కన్నేయగా, కోహ్లీ.. సచిన్‌ రికార్డుపై కన్నేశాడు. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్‌ (3077 ) అగ్రస్థానంలో ఉండగా.. పాంటింగ్‌ ( 2164) రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో రోహిత్‌ (2037) ఉన్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్ 128 పరుగులు చేస్తే.. పాంటింగ్‌ను అధిగమిస్తాడు.

సచిన్‌ రికార్డుపై కోహ్లీ కన్ను:

సచిన్‌ రికార్డుపై కోహ్లీ కన్ను:

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ (9) తొలి స్థానంలో నిలవగా.. కోహ్లీ (8) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్‌ 71 మ్యాచ్‌ల్లో 9 శతకాలు సాధించగా.. కోహ్లీ 37 మ్యాచ్‌ల్లో 8 శతకాలు చేసాడు. మరోవైపు రోహిత్ 37 మ్యాచ్‌ల్లో 7 శతకాలు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో సచిన్‌ రికార్డు బద్దలు కొట్టడానికి కోహ్లీ-రోహిత్‌లకు అవకాశం ఉంది.

 మరో సెంచరీ:

మరో సెంచరీ:

భారత్‌లో వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (20 సెంచరీలు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, ఇప్పుడు ఆ రికార్డుకి ప్రస్తుత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ చేరువయ్యాడు. స్వదేశంలో ఇప్పటివరకు 19 సెంచరీలు చేసిన కోహ్లీ.. మరో సెంచరీ చేస్తే సచిన్ సరసన నిలుస్తాడు.

సిరీస్ పట్టాలని భారత్‌:

సిరీస్ పట్టాలని భారత్‌:

గతేడాది భారత్‌లో పర్యటించిన ఆసీస్‌ 5 వన్డేల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు వన్డేలు గెలిచిన భారత్‌.. ఆపై జరిగిన మూడు వన్డేలలో ఓడింది. అయితే ఇప్పుడు కంగారూలపై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఇలా ఏ విభాగంలో చూసుకున్నా ఇరుజట్లు సమ ఉజ్జీలుగా కనపిస్తుండటంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Tuesday, January 14, 2020, 10:25 [IST]
Other articles published on Jan 14, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+